Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెరుగు ఇడ్లీ..జిందగీలో మర్చిపోలేని టేస్ట్,ఎలా చేయాలంటే
సమ్మర్ ప్రారంభం నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఈ మండే ఎండాకాలంలో చాలామంది కడుపు చల్లగా ఉండాలని పెరుగు అన్నం లేదా పెరుగుతో తయారుచేసినవి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ సమ్మర్ లో ఖచ్చితంగా తినాల్సిన వంటకాల్లో పెరుగు ఇడ్లీ ఒకటి. వాస్తవానికి ఏ సీజన్ లో అయినా దీనిని ఆస్వాదించవచ్చు కానీ మండే ఎండాకాలంలో దీనిని తింటుంటే మాత్రం ఆ మజానే వేరే లెవల్లో ఉంటుంది. పిల్లలు,పెద్దలు అన్ని వయస్సుల వారికి నచ్చే వంటకం ఇది.
పెరుగు ఇడ్లీ ఆఫీసులకు,స్కూల్ వెళ్లేవారికి లంచ్ బాక్స్ లలో పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. పెరుగు ఇడ్లీని ఇంట్లో సులభంగా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

పెరుగు ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
- 8 ఇడ్లీ
- అర లీటరు పెరుగు
-గుప్పెడు జీడిపప్పు
-కొన్ని దానిమ్మ గింజలు
-అరకప్పు కాచిన పాలు
- 1స్పూన్ ఆవాలు
-అర స్పూన్ జీలకర్ర
-1 పచ్చిమిర్చి
-2 ఎండుమిర్చి
-అర స్పూన్ శెనగపప్పు
-అర స్పూన్ మినపప్పు
-మజ్జిగ
-కొంచెం కరివేపాకు
- 1 టేబుల్ స్పూన్ ఆయిల్
- రుచికి తగినంత ఉప్పు
-కొద్దిగా ఇంగువ
-1 టేబుల్ స్పూన్ చక్కెర
రాయలసీమ స్పెషల్ జోం పచ్చడి..నాకు నాకు అని కొట్టుకుంటారు,ఎలా చేయాలంటే
పెరుగు ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఓ గిన్నెలో అరలీటరు పెరుగు,పావు కప్పు క్రీము లేదా కాచిన పాలు పోసి చిలకండి.
-ఇప్పుడు అందులో కొంచెం చక్కెర వేసి చిలకాలి.
-తర్వాత అందులోనే అరకప్పు నీళ్లు పోసి కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఓ బౌల్ లో నీరు,ఉప్పు,చిలికిన మజ్జిగ పోసి బాగా కలపండి. ఇందులో పూర్తిగా చల్లారిన ఇడ్లీని అర నిమిషం పాటు ముంచి తీసి పక్కనపెట్టుకోండి.
-తీసి పక్కనపెట్టుకున్నఆ ఇడ్లీల మీద ముందుగా చిలికి పెట్టి ఉంచిన పెరుగు పోసి ఈ గిన్నెను ఒక గంటపాటు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి.
-ఇప్పుడు ఓ బాండీలో ఆయిల్ పోసి దానిని వేడి చేయాలి.
-తర్వాత అందులో ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,మినపప్పు,శెనగపప్పు,పచ్చిమిర్చి,కరివేపాకు,జీడిపప్పు,ఇంగువ వేసి ఈ తాళింపుని దోరగా వేయించి పక్కనపెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
-తినడానికి ముందు ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు ఇడ్లీ గిన్నెను బయటకు తీసి అందులో ఈ తాళింపు,దానిమ్మ గింజలు వేసి కలుపుకోండి.అంతే అమృతం లాంటి పెరుగు ఇడ్లీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications