Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ స్పానిష్ స్వీట్ పొటాటో ఆమ్లెట్ సో యమ్మీ అండ్ టేస్టీ
Sweet Potato Omelette హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కోరుకునేవారు గుడ్డుతో రోజును ప్రారంభించండి. ఎందుకంటే గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో అవసరమైన పోషకాంశం. అంతే కాదు ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మధ్యహ్నాం వరకు ఆకలి అవ్వకుండా కడుపునిండుగా అనిపిస్తుంది. ఇతర ఆహారాల జోలికి పోనివ్వదు. కాబట్టి ఈ రోజు గుడ్డుతో ఒక హెల్తీ వరైటీ బ్రేక్ ఫాస్ట్ గురించి తెలుసుకుందాం. స్వీట్ పొటాటో ఆమ్లెట్ అనేది అద్భుతమైన అల్పాఆహారం. దీన్ని తయారు చేయడం సులభం మరియు ఇది కేవలం 15 నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. అల్పాహారం, భోజనం లేదా రాత్రి భోజనం కోసం దీన్ని సర్వ్ చేయండి. దీని రుచి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
ఈ ఆమ్లెట్ టోర్టిల్లా ఎస్పానోలా అని పిలువబడే క్లాసిస్ స్పానిష్ ఆమ్లెట్‌తో సమానంగా ఉంటుంది. ఇది సాధారణ బంగాళాదుంపలకు బదులుగా చిలగడదుంపలను ఉపయోగించి మనం దీన్ని తయారుచేసుకోవచ్చు. అంతే కాదు బంగాళదుంపల కంటే, చిలగడదుంపలతో తయారుచేసే ఈ ఆమ్లెట్ రుచిని నిజంగా పెంచుతుంది. ఈ ఆమ్లెట్ ను నాన్ స్టిక్ పాన్ మీద వేసుకుంటే ఈజీగా ఉండటమే కాదు, అందమైన షేప్ కూడా వస్తుంది. ఇక రుచి విషయంలో ఆలివ్ ఆయిల్ వాడితే రుచి అద్బుంగా ఉంటుంది. మరి ఈ రిసిపిని ఎలా తయారుచేయాలి. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
4 గుడ్లు
1 స్వీట్ పొటాటో(తురుమి పెట్టుకోవాలి)
2 టేబుల్ స్పూన్లు చీజ్ తురుము
1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము
1టీస్పూన్ చాట్ మసాలా
1 ఉల్లిపాయ (సన్నగా కట్ చేసుకోవాలి)
1 టమోట(చిన్నగా కట్ చేసుకోవాలి.
1 టీ స్పూన్, పాలు
కారం కొద్దిగా,
నూనె సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెతీసుకుని అందులో 4 గుడ్లను పగలగొట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే అందులోనే చీజ్ తురుము, ఉప్పు కారం, ఒక టబుల్ స్పూన్ పాలు కూడా వేసుకుని క్రీమీగా అయ్యేంతవరకు 5 నుండి 10 నిముషాలు హ్యాండ్బ్లెండర్తో బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఆ తర్వాత స్టౌ వెలింగి దానిపై పాన్ పెట్టి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలనూ వేసి మీడియం మంట మీద దొరగా వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే టొమోటో ముక్కలను కూడా వేగించాలి.
4. ఈ మొత్తం మిశ్రమం వేగుతుండగా అందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న చిలగడదుంప గుజ్జు వేసి మిక్స్ చేయాలి.
5. ఒకటి రెండు నిముషాల తర్వాత అందులోనే చాట్ మసాలా, చిటికెడు ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో బాగా కలిపి.
6. ఇప్పుడు టొమాటో సాస్, చిల్లీ సాస్ కూడా వేసి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7. తర్వాత స్టౌ మీద మరో పాన్ పెట్టి వేడెక్కాక గుడ్ల మిశ్రమంతో ఒక్కో ఆమ్లెట్ వేసుకోవాలి. వెంటనే దాని మీద ముందుగా తయారుచేసి పెట్టుకున్న చిలగడదుంప మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని గరిటెతో మొత్తం స్ప్రెడ్ చేయాలి.
8. తర్వాత మీడియం మంట మీద ఆమ్లెట్‌ను రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే స్వీట్ పొటాటో ఎగ్ ఆమ్లెట్ రెడీ. వాటిని ఫోల్డ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
9. అంతే నచ్చిన వాటితో గార్నిష్ చేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆమ్లెట్స్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








