Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
ప్రకృతి అందించిన దివ్య ఔషధాల్లో ప్రధానమైనది మునగ ఆకులు. ఆయుర్వేదంతో పాటు అలోపతి మందుల తయారీలోనూ మునగ ఆకులు కీలక పాత్ర పోషిస్తారు. డయాబెటిస్ బాధితులకు, అధిక రక్తపోటు సమస్యకు, గుండె ఆరోగ్యం ఇలా ఒకటేమిటి శరీరంలో అనేక రకాల వ్యాధులకు ఇది సంజీవనిలా పనిచేస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో మన కిచెన్‌లో మునగ ఆకులు, మునక్కాయల వాడకం పెరిగిపోయింది. మునగాకు పచ్చడి, రసం ఇలా చాలా రకాలుగా వండుతున్నాం. ఈ క్రమంలో మునగాకుతో ఇలా పొడి చేసి పెట్టండి. నెల రోజుల పాటు నిల్వ ఉండటమే కాదు.. అన్నంలోకి, టిఫిన్లలోకి తినేయొచ్చు. దీంతో శరీరానికి తగిన పోషకాలు పుష్కలంగా అందుతాయి.

మునగాకు పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు
మునగ ఆకులు- ఒక పెద్ద కప్పు
పచ్చి శనగపప్పు- రెండు టేబుల్ స్పూన్లు
మినప్పప్పు- రెండు టేబుల్ స్పూన్లు
కందిపప్పు- టేబుల్ స్పూన్
నువ్వులు- టేబుల్ స్పూన్
వెల్లుల్లి- పది
ఎండు మిర్చి- ఆరు
చింతపండు- కొద్దిగా
ఉప్పు- అరటీస్పూన్
ఇంగువ- కొద్దిగా
మునగాకు పొడి తయారీ విధానం
మునగాకు పొడి తయారీ కోసం ముందుగా మునగ ఆకులను కడిగి ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం పోయిన తర్వాత స్టవ్‌పైన పాన్ పెట్టి వేడయ్యాక ఈ ఆకులను వేసి క్రిస్పీగా అయ్యేవరకు దాదాపు 10 నిమిషాల పాటు సన్న మంటపైన వేగనివ్వాలి.
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.!
మునగాకు వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్‌లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు నువ్వులు చిటపట అనేవరకు వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఎండుమిర్చితో పాటు కొద్దిగా చింతపండు వేసి వేపిన తర్వాత చల్లారనివ్వాలి.
వీటన్నిటినీ మిక్సీ జార్‌లోకి తీసుకుని ఉప్పు, ఇంగువ వేసి మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అంతే సింపుల్‌గా ఆరోగ్యకరమైన మునగాకు పొడి రెడీ. చల్లారిన తర్వాత గాజు డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. తడి తగలకుండా, గాలి చొరబడకుండా ఉంటే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది.
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
ఈ పొడిని ప్రతిరోజూ వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకుని తినవచ్చు. లేదా ఇడ్లీలోకి పొడిగా చట్నీతో పాటు వేసుకోవచ్చు. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి బటన్ ఇడ్లీలతో పాటు వేయించుకుని తింటే ఆ రుచికి స్వర్గం కనిపిస్తుంది. ఉదయాన్నే లైట్ ఫుడ్‌లోకి తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మునగాకు పొడి తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. వయసుతో సంబంధం లేకుండా మునగాకు పొడిని తీసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications