Latest Updates
-
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్‌క్‌తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.!
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.!
భోజనం చివర్లో రసం, సాంబార్ లేదా పెరుగు లేనిదే సంతృప్తి ఉండదు. ఇక పెరుగు తినడం అలవాటు లేని వారికి ఖచ్చితంగా రసం లేదా సాంబార్ ఉండాల్సిందే. సాంబార్‌తో పోలిస్తే రసం చేయడం చాలా ఈజీ. ఇక మన తెలుగు రాష్ట్రాల స్టైల్‌లో రసం ఎలా తయారుచేస్తారో తెలిసిందే. కానీ రొటీన్ స్టైల్ కాకుండా ఈ సారి కర్ణాటక మైసూర్ సంప్రదాయ పద్ధతిలో ఈ టేస్టీ రసం తయారుచేయండి.. ఒక్కసారి రుచి చూశారంటే అన్నంలోకి కాకుండా గ్లాసులో పోసుకుని తాగేస్తారు.

మైసూర్ స్టైల్ రసం రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు
కందిపప్పు- 100గ్రాములు
నెయ్యి- టీస్పూన్
ధనియాలు- రెండు టీస్పూన్లు
నల్ల మిరియాలు- టీస్పూన్
జీలకర్ర- టీ స్పూన్
కందిపప్పు- టీస్పూన్
తురిమిన పచ్చికొబ్బరి- అరకప్పు
ఎండుమిరపకాయలు- నాలుగు
ఇంగువ- అరటీస్పూన్
చింతపండు- నిమ్మకాయ సైజు
టొమాటో- రెండు
పసుపు- అరటీస్పూన్
ఉప్పు- టీస్పూన్
బెల్లం- చిన్న ముక్క
కొత్తిమీర- గుప్పెడు
తాలింపు కోసం
నెయ్యి- టేబుల్ స్పూన్
ఆవాలు- టీస్పూన్
ఎండు మిర్చి- నాలుగు
ఇంగువ- అర టీస్పూన్
కరివేపాకు- రెండు రెబ్బలు
కర్ణాటక స్టైల్ మైసూర్ రసం తయారీ విధానం
ముందుగా పప్పు కడిగి కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడికించుకోవాలి. చింతపండు కడిగి నానబెట్టుకోవాలి.
బ్రిటిష్ కాలం నాటి కోల్‌క్‌తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.!
స్టవ్‌పైన పాన్ పెట్టుకుని వేడయ్యాక టీస్పూన్ నెయ్యి వేసి కరిగాక ధనియాలు, నల్ల మిరియాలు, జీలకర్ర, కందిపప్పు, తురిమిన పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించుకోవాలి.

దోరగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్‌లో వేసుకుని చల్లారనివ్వాలి. ఈ లోపు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
చల్లారిన దినుసులను మిక్సీ జార్‌లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్‌పైన బాణలి పెట్టుకొని అందులో చింతపండు గుజ్జు నుంచి తీసిన రసాన్ని పోసుకోవాలి. తర్వాత కట్ చేసిన టొమాటో ముక్కలను వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి కలిపి మరిగించుకోవాలి.
ఇందులో రుబ్బుకున్న పేస్ట్‌ను వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత ఉడికించిన కందిపప్పును వేసుకుని మరోసారి కలపాలి.
పసుపు, ఉప్పు, బెల్లం, కొత్తిమీర తురుము వేసి ఐదు నిమిషాల పాటు మీడియం మంటపైన ఉడికించుకోవాలి. ఇప్పుడు మంట చిన్నగా చేసి రసం వేసి మరిగించాలి.
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.!
ఈలోపు మరో స్టవ్‌పైన చిన్న పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కాగిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి.
ఈ తాలింపును రసంలో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రుచికరమైన మైసూర్ స్టైల్ రసం రెసిపీ రెడీ. వేడివేడి అన్నంలోకి తినేయొచ్చు లేదా గ్లాసులో పోసుకుని అయినా తాగేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications