Latest Updates
-
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే?
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.!
సండే వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు పక్కా కక్కా ముక్కా ఉండాల్సిందే. మటన్ విషయానికొస్తే ఎన్నో వెరైటీలు. మటన్, బోటి, తలకాయ కూర, నల్లి బొక్కల కూర ఇలా ఎన్నో రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక ఎముకల దృఢత్వాన్ని పెంచేందుకు మటన్ పాయ, నల్లి బొక్కల కూరను తినాలని డాక్టర్లు సైతం సిఫారసు చేస్తుంటారు. నల్లి బొక్కల కూరలో గోంగూర కలిపితే ఇక ఆ టేస్ట్కి తిరుగు లేదు. దీనిని రాగి ముద్దతో తింటే ఎముకలు ఉక్కుల్లా మారాల్సిందే. గోంగూర నల్లి బొక్కల మటన్ కూర ఎలా తయారుచేయాలో చూద్దాం..

గోంగూర నల్లి బొక్కల మటన్ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
నల్లి మటన్- కేజీ
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు- టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకు- రెండు
ఉల్లిపాయలు- మూడు(మీడియం సైజు)
టమాటా- నాలుగు(మీడియం సైజు)
పచ్చిమిర్చి- నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు టేబుల్
స్పూన్లు
పసుపు- అర టీస్పూన్
కొత్తిమీర- గుప్పెడు
ఉప్పు- రుచికి సరిపడా
కారం- మూడు టేబుల్ స్పూన్లు
గోంగూర- రెండు మీడియం సైజు కట్టలు
ధనియాల పొడి- టేబుల్ స్పూన్
గరం మసాలా- టీస్పూన్
గోంగూర నల్లి బొక్కల మటన్ కూర తయారీ విధానం
మటన్ నల్లి బొక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గోంగూర ఆకులను ఒలిచి కడిగి నీళ్లు పోయేలా ఆరబెట్టాలి.
ఇప్పుడు స్టవ్పైన వెడల్పాటి బాణలి పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి.
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ
మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవి దోరగా బాగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
పసుపు, కొత్తిమీర వేసి కలిపిన తర్వాత మటన్ నల్లి బొక్కలను వేసి మగ్గించాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి.
ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలపాలి. ముక్కలకు కారం బాగా పట్టి ఉడికేలోపు మరో స్టవ్పైన పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి గోంగూరను వేయించాలి.

ఈ గోంగూర ముద్దను మటన్లో వేసి కలిపి ఉడికిన తర్వాత మీకు కావాల్సిన గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. మూత పెట్టి మీడియం మంటపైన ఉడికించాలి. నూనె పైకి తేలే వరకు గోంగూర నల్లి బొక్కల కూరను ఉడికించాలి.
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.!
అంతే స్పైసీ గోంగూర మటన్ నల్లి బొక్కల కూర రెడీ. రాగి ముద్దతో తింటే ఎంత తిన్నా తనివితీరదు. ఈ స్పెషల్ నాన్వెజ్ రెసిపీతో ఎముకలు దృఢంగా మారడమే కాదు మొత్తం శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మహిళలు, వయసు పైబడిన వారు తప్పనిసరిగా నెలలో ఒక్కసారైనా తినాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
