Latest Updates
-
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.!
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.!
పనీర్ వెరైటీలు అంటే ఇష్టపడని వారుండరు. పనీర్ టిక్కా, పనీర్ బిర్యానీ, పనీర్ కర్రీ ఇలా ఎన్నో రకాలు ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. ఇలా పనీర్ స్పెషల్స్‌లో బ్రిటిష్ కాలం నాటి నుంచి ఫేమస్ అయిన ఒక హెల్తీ స్నాక్ పనీర్ కతీ రోల్. కోలక్‌తా రెస్టారెంట్లలో ఎక్కువగా అందుబాటులో ఉండే ఈ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ స్నాక్‌ను తినడమే కాదు చేయడం కూడా చాలా ఈజీ. వర్షాకాలంలో హెల్తీగా స్నాక్స్, డిన్నర్ తినాలంటే పనీర్ కతీ రోల్ సరైన ఆప్షన్. ఈ నోరూరించే జ్యూసీ వంటకాన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం..

పనీర్ కతీ రోల్ తయారీకి కావాల్సిన పదార్థాలు
తాజా పనీర్- 200 గ్రాములు
పెరుగు- కప్పు
పసుపు- పావు టీస్పూన్
కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్- ఒకటిన్నర
టీస్పూన్
జీలకర్ర పొడి- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
గరం మసాలా- టీస్పూన్
ఉప్పు- అరటీస్పూన్
నల్ల మిరియాల పొడి- అర టీస్పూన్
నిమ్మరసం- టీస్పూన్
గోధుమ పిండి- కప్పు
మైదా పిండి- అరకప్పు
ఉప్పు- పావు టీస్పూన్
నెయ్యి- రెండు టీస్పూన్లు
ఉల్లిపాయ- ఒకటి
క్యాప్సికమ్- ఒకటి
టొమాటో- ఒకటి
పనీర్ కతీ రోల్ తయారీ విధానం
పనీర్ కతీ రోల్ తయారీ కోసం ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో పెరుగు వేసి బాగా గిలక్కొట్టాలి. అందులో పసుపు, కశ్మీరీ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, నల్ల మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.!
ఈ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న తాజా పనీర్ ముక్కలను వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి.
ఇప్పుడు మరో బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి వేసి ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా నెయ్యి అప్లై చేసి సాఫ్ట్‌గా కలిపి మూత పెట్టి పావు గంట పాటు పక్కన ఉంచాలి.
ఈ లోపు గార్నిష్లో భాగంగా గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్లో కడిగి పెట్టుకున్న కప్పు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు, పావు టీస్పూన్ నల్ల ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత స్టవ్‌పైన పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరిగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పనీర్ ముక్కలను వేసి వేగనివ్వాలి. ఈ లోపు ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటాలను పొడుగ్గా, సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
పనీర్ వేగిన తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా ముక్కలను వేసి మగ్గనివ్వాలి. మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇప్పుడు పిండి ముద్దలోంచి మీడియం సైజు ముద్దలుగా చేసుకుని చపాతీగా ఒత్తుకోవాలి. తర్వాత రోల్ చేసి మరోసారి పరోటా మాదిరిగా ఒత్తుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకుని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి.
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.!
చపాతీలను కాల్చేటప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటే పొంగుతూ సాఫ్ట్‌గా వస్తాయి. చపాతీపైన మొదటగా కొద్దిగా గ్రీన్ చట్నీ కొద్దిగా అప్లై చేసి దానిపైన మీకు నచ్చినంత పనీర్ స్టఫ్‌ను పెట్టుకుని దానిపై కొంచెం గ్రీన్ చట్నీ వేసుకుని చపాతీని రోల్ చేసుకోవాలి.
ఇలా అన్ని చపాతీలను చేసుకోవాలి. అంతే టేస్టీ పనీర్ కతీ రోల్ రెడీ. సాయంత్రం స్నాక్స్‌గా లేదా డిన్నర్‌లోకి లైట్‌గా తినాలనుకునేవారికి ఈ హెల్తీ రెసిపీని ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications