Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నాన్ వెజ్ స్పెషల్ రుచులతో... స్పెషల్ సండే...
ప్రస్తుతం మారుతున్న జీవన శైలితో పాటు మన ఆహార అలవాట్లు మారుతున్నాయి. సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అది శాకాహారమైనా... మాంసాహారమైన సరే. శరీర నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవం తంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి.
శాకాహారంలో ప్రతి రోజూ రకరకాల తాజా గ్రీన్ లీఫీ వెజిటెబుల్స్ తో వంటలు వండుకొని తింటారు. అదే మాంసాహారులలైతే....? వీరు మాత్రం ఎక్కువగా చికెన్, మటన్, ఫిష్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మాంసాహారులు ఎప్పుడూ ఒక రకమైన వంటకాన్ని రుచి చూడం వల్ల కొంత బోరు అనిపించవచ్చు. అలా బోరు అనిపించే రుచులు కాకుండా, ఈ సండే స్పెషల్ గా కొన్ని విభిన్నమైన రుచులకు మీ ముందుకు తీసుకొస్తోంది తెలుగు బోల్డ్ స్కై. కామ్.
ఆదివారం అనగానే కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉంటారు. కాస్త స్పెషల్ వంటకాలు ఉండాలని అనుకుంటారు. మాంసాహారం తినేవాళ్లకైతే తప్పనిసరి ఆదివారం నాన్ వెజ్ ఉండాల్సిందే లేకపోతే వెలితిగా ఉంటుంది. మాంసంతో కూరలు వగైరా చేసుకోవడం తెలుసు కాని కాస్త వెరయిటీగా ఎలా తయారు చేయడమో చాలా మందికి తెలియదు. మాంసాహార ప్రియల్లో చాలా మంది సీఫుడ్(సముద్రపు ఆహారాల) ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇవి మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు మంచి రుచి కూడా. ఇలా ఆరోగ్యాన్ని, రుచిని రెండింటిని అంధించే ఆహారపు కాంబినేషన్ చాలా అరుదు. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సీఫుడ్ ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అలాగే చికెన్ కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు, మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. తేలికగా జీర్ణము అవుతుంది. కోడిమాంసము వేడి చేస్తుందని అనుకోవడం సరైనది కాదు... ఇది మంచి పౌష్టికాహారము.

మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్పైసీ చికెన్ మసాలా...
సాధారణంగా మనకు ఇష్టమైన వంటలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని మళ్ళీ మళ్ళీ తయారు చేయడానికి విసుగు అనిపించదు. ఎందుకంటే వాటి రుచి అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. అలాంటి వాటిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అమితంగా ఇష్టపడే వంట స్పైసీ చికెన్ మసాలా కర్రీ. ఇది చూడటానికి, తినడానికి రెస్టారెంట్ వంటాల అనిపిస్తుంది కానీ రెస్టారెట్ ఐటమ్ మాత్రం కాదు. మనమే ఇంట్లో స్వయంగా చేసుకోవచ్చు.

మంగళూరు ఫిష్ కర్రీ: సౌంత్ ఇండియన్ స్పెషల్
ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. అది మంగళూర్ ఫిష్ కర్రీలు, ఫ్రైలు చాలా వెరైటీ రుచులతో ఉంటాయి. అక్కడికి వెళ్ళ పర్యాటకుల ఇలాంటి రుచులును చాలా ఇష్టంగా తింటుంటారు. మంగళూర్ స్పెషల్ కొబ్బరి పాలతో తయారు చేసే వారి వంటలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీకి సౌత్ ఇండియన్ స్పైసీ కలిపితే మరింత రుచికరంగా ఉండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అటువంటి రుచిని మనం ఇట్లో తయారు చేసుకొనొ మంగళూర్ రుచులను ఆస్వాదిద్దాం..

మటన్ కర్రీ-రాజ్ పుత్ స్పెషల్
ఈ రాయల్ డిష్ మటన్ కర్రీ రాజ్ పుతానీ కిచెన్ స్పెషల్. రాజస్థాన్, జోధ్ పూర్ ప్రదేశాల్లో ఇది చాలా ఫేమస్ వంటకం. ఈ మటన్ కర్రీకి ఎక్కువగా టామోటోలు, ఉల్లిపాయలు ఉపయోగిస్తారు. ఇండియన్ మసాలాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ రాజ్ పుత్ స్పెషల్ కారం కారంగా ఎప్పుడూ నోరూరిస్తుంటుంది. అక్కడి మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టమైన రాజ్ పుత్ మటన్ కర్రీని లాల్ మాస్ అని కూడా అంటారు. ఈ రుచికరమైన రాజ్ పుత్ మటన్ కర్రీనీ మీరూ టేస్ట్ చూడాలనుకుంటే, ఇంట్లోనే స్పెషల్ గా తయారు చేసుకొనే చక్కటి విధానం ఇక్కడ ఉంది. ఈ రాజ్ పుత్ స్పెషల్ కర్రీ అన్నం, చపాతీలు, దోసెల్లోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి.

డిన్నర్ పార్టీ స్పెషల్ - చికెన్ ముర్గ్ కుర్మా
ముర్గ్ కుర్మాను స్పెషల్ గా వండుతారు. దీన్ని కొబ్బరి మరియు పెరుగుతో తయారు చేస్తారు. ఈ రుచికరమైన చికెన్ ముర్గ్ కుర్మాను రోటీ, చపాతీ, నాన్ తో తినవచ్చు. ఈ రుచికరమైన టేస్టీ వంటకం రాత్రి డిన్నర్ పార్టీకి బాగా సూట్ అవుతుంది.

స్వీట్ అండ్ స్పైసీ టేస్ట్ చికెన్ దో ప్యాజ్..
తియ్యతియ్యగా.... కారం కారంగా ఉండే చికెన్ దో ప్యాజ్. చికెన్ వెరైటీలలో ఇదో రకం. ఈ వంటకం పంజాబీలు ఎక్కువగా ఇష్టపడుతారు. చికెన్ దో ప్యాజ్ ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది సాధారణ చికెన్ మసాలా కర్రీలానే ఉంటుంది. అయితే ఉల్లిపాయలను ఎక్కువగా వాడటం వల్ల చికెన్ ఫేవర్ మారుతుంది. దాంతో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది బిర్యాని, చపాతీలకు అద్భుతమైనటువంటి కాంబినేషన్. భారతీయ సుంగద్రవ్యాలు, ఉల్లిపాయ ముక్కలు, చికెన్ తో చేసే ఈ వంటకాన్నీ ఏ కార్యాలకైనా(సందర్భాలలోనైనా) వండుకోవచ్చు.

చికెన్ హలీమ్ రుచి చూడాల్సిందే...
రంజాన్ మాసం అంటే కొన్ని ప్రత్యేక వంటకాలకు ప్రసిద్ధి. హలీమ్, ఖర్జూరా, సేమ్యాలు వంటి పదార్థాలు అందరికీ నోరూరిస్తాయి. రంజాను మాసంలో ఎంతో మంది హలీమ్ రుచిని ఆస్వాదిస్తునే ఉంటారు. మరి అలాంటి హలీమ్‌కు పెట్టింది పేరు పురానాషహర్. అనేక రకాల మసాలాలు, మాంసం, గోధుమ రవ్వ, సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ అన్నింటినీ కలిపి చేసే వంటకమే హలీమ్. హలీమ్ కు ఉన్న ప్రాధాన్యతను బట్టి రంజాన్ మాసంలోనే కాకుండా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఏడాది మొత్తం కాలం దొరికే ప్రాంతాలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు.

కోరి రోటీ..మంగళూరు స్పెషల్..
ధక్షిణ భారత దేశంలో మంగళూరు వంటకాలు చాలా ప్రసిద్ది. ముఖ్యంగా మాంసాహార వంటకాలు. అందులో సీ ఫుడ్ చాలా పాపులర్. మాసాహార వంటకాల్లో వెరైటీగా రుచి చూడాలంటే మంగళూరు వంటకాల్ని ఇంట్లో ప్రయత్నించవచ్చు. ఈ మంగళూరు మాంసాహార వంటలు కారం కారంగా రుచి... మంచి రంగుతో ఘుమఘుమలాడుతుంటాయి.

స్పెసీ చికెన్ బర్త...పాపులర్ సైడ్ డిష్
చికెన్ బర్త ఒక పాపులర్ సైడ్ డిష్. దీన్ని ఎక్కువగా ప్లెయిన్ రైస్, రోటిస్ కి మంచి కాంబినేషన్. ఈ నాన్ వెజిటేరియన్ రిసిపిని చికెన్ మరియు ఇండియన్ మసాలాలతో తయారు చేస్తారు. ఇతర నాన్ వెజిటేరియన్ వంటకాలతో పోల్చితే ఈ వంట మరింత స్పైసీగా ఉంటుంది. ఈ నాన్ వెజిటేరియన్ వంటకాన్ని కొంచెం వెరైటీగా తయారు చేస్తారు. చికెన్ బాగా మెత్తగా చిదిమి తర్వాత మసాలాలు, ఉల్లిపాయలతోటి వండుతారు. మరి ఈ వంటను ఎలా తయారు చేయాలో చూద్దాం...

ఫిష్-బ్రింజాల్ కర్రీ
ఈ ఫిష్ కర్రీ ప్లెయిన్ రైస్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. ఈ ఫిష్ కర్రీను ఏప్పుడైనా, ఏ సందర్భంలోనైనా వండుకోవచ్చు. ఈ రుచికరమైన వంటకం ఫ్యామిలీ మెంబర్స్ కు, అతిథులకు అందించడమే కాకుండా ఫిష్ లవర్స్ నుండి ప్రసంశలను పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు టేస్ట్ చూసేయండి...

డాబా స్టైల్ మటన్ కర్రీ
ఇది స్పైసీగా ఉండే నార్త్ ఇండియన్ డాబా స్టైల్ మటన్ రిసిపి. చాలా టేస్టీ గా ఉంటుంది. ఈ డాబా స్టైల్ మటన్ ఇడ్లీ, దోసె, చపాతీ రైస్ కు చాలా మంచి కాంబినేషన్ దీన్ని ఒకసారి రుచిచూస్తే మళ్ళీ మళ్ళీ తినాలినిపిస్తుంది. డాబా మటన్ కుర్మాలో కాశ్మిరి మిర్చీ, టమోటో గుజ్జు చేర్చడం వల్ల మరింత టేస్ట్ మరింత చిక్కగా తయారవుతుంది. కాబట్టి డాబా స్టైల్ మటన్ ను మీరు ట్రై చేసి దోసె, ఇండ్లీ, చపాతీతో, రైస్ రుచి చూడండి....



Click it and Unblock the Notifications











