Latest Updates
-
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా?
స్వీట్ అండ్ స్పైసీ టేస్ట్ చికెన్ దో ప్యాజ్..
తియ్యతియ్యగా.... కారం కారంగా ఉండే చికెన్ దో ప్యాజ్. చికెన్ వెరైటీలలో ఇదో రకం. ఈ వంటకం పంజాబీలు ఎక్కువగా ఇష్టపడుతారు. చికెన్ దో ప్యాజ్ ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది సాధారణ చికెన్ మసాలా కర్రీలానే ఉంటుంది. అయితే ఉల్లిపాయలను ఎక్కువగా వాడటం వల్ల చికెన్ ఫేవర్ మారుతుంది. దాంతో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది బిర్యాని, చపాతీలకు అద్భుతమైనటువంటి కాంబినేషన్. భారతీయ సుంగద్రవ్యాలు, ఉల్లిపాయ ముక్కలు, చికెన్ తో చేసే ఈ వంటకాన్నీ ఏ కార్యాలకైనా(సందర్భాలలోనైనా) వండుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
చికెన్: 1kg
ఉల్లిపాయలు: 1/2kg(రౌండ్ గా కట్ చేసుకోవాలి)
పెరుగు: 1/4ltr
కారం: 2tsp
గరం మసాలా: 1tbso
ఉప్పు: రుచికి తగినంత
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పసుపు: 1tsp
ధనియా: 1tsp
టమోటో గుజ్జు: 250grms(2cups)
నూనె: తగినంత
గుడ్లు: 4(ఉడికించినవి)
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. అందులో హోల్ గరం మసాలా వేయాలి.
2. తర్వాత మిక్సీలో పెరుగు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్ లో వేగుతున్న హోల్ గరం మసాలా కు కలిపి వేయించాలి.
3. రెండు నిమిషాల తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లిపేస్ట్, మరియు గరం మసాలా వేసి కలుపుతూ వేయించుకోవాలి.
4. తర్వాత టమోటో గుజ్జును వేసి మరో రెండు నిమిషాలు వేయించి, అవసరమనుకొంటే కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి.
5. తర్వాత ఉడుకుతున్న గ్రేవీలో చికెన్ ను కలిపి మరో పది నిమిషాల మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి.
6. చికెన్ మృధువుగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసే ముందు ఉడికించిన గుడ్లను కూడా కలుపుకొని ఒక నిమిషం ఉడికిన తర్వాత ఉల్లిపాయ చక్రాలను అందులో వేసి ఉడికించుకోవాలి. అంతే చికెన్ దో ప్యాజ్ రెడీ.. హాట్ హాట్ చికెన్ దో ప్యాజ్ ను సర్వ్ చేయడమే తరువాయి....



Click it and Unblock the Notifications