Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
చికెన్ కాజూ కుర్మా

చికెన్: 1/2kg
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
కరివేపాకు: ఒక రెమ్మ
కాజూ: 1/2cup
కొత్తిమీర: 1cup
నూనె: తగినంత
ఉప్పు, కారం: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
అల్లంవెల్లుల్లి ముద్ద: 2tbsp
మసాలాకు
లవంగాలు: 6
చెక్క: చిన్న ముక్క
జీలకర్ర: 1tsp
ధనియాలు: 1tbsp
గసగసాలు: 2tsp
తయారు చేసే విధానం :
1. ముందుగా చికెన్ లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి ఒక అరగంట ఫ్రిజ్ లో ఉంచాలి.
2. మసాలా దినుసులు అన్ని మెత్తగా పొడి కొట్టుకోవాలి.పది జీడిపప్పులు కూడా పొడి చేసుకోవాలి. నూనె వేడిచేసి మిగిలిన కాజూ వేయించి తీసుకోవాలి.
3. ఇప్పుడు అదే నూనెలో తరిగిన కొత్తిమీర, మిర్చి, తగినంత కారం వేసి దోరగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
4. తర్వాత అల్లంవెల్లుల్లి ముద్దవేసి పచ్చివాసన పోయేవరకు వేయించి, మసాలా పొడి, పసుపు కూడా వేసి బాగా కలిపి రెండు నిముషాలు వేయించాలి.
5. ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి సన్ననిసెగపై అయిదు నిమిషాలు ఉడికించి,తగినంత ఉప్పు, ఒక కప్పు నీళ్ళు కలిపి మూత
పెట్టి ఉడికించాలి.
6. చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కాజూ పొడి, వేయించిన కాజూ కలిపి కూర బాగా దగ్గరయ్యే వరకు ఉడికించి దించెయ్యాలి.
ఒక బౌల్ లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర చల్లితే ఎంతో రుచిగా ఉండే చికెన్ కాజూ కుర్మా రెడీ అవుతుంది.



Click it and Unblock the Notifications