Latest Updates
-
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి -
బుద్ధ పూర్ణిమ ఈసారి ఎప్పుడొస్తోంది? బ్యాంక్ పనులు ఉన్నవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! -
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి
దమ్ కా బిర్యానీ : రంజాన్ స్పెషల్
బిర్యానీ అంటే మొదట గుర్గు వచ్చేది మన ఇండియాలో హైదరాబాదే. మన భారతదేశంలోనే బిర్యానీ తినాలంటే మాత్రం హైదరాబాదా రావాల్సిందే...బిర్యానీ, మైదరాబాద్ ఒకే సంస్కృతికి రెండు పేర్లు. మిర్చీకా సాలన్, పెరుగు పచ్చడి, మీటా పాన్, డబుల్ కా మీఠా.. ఇవన్నీ బిర్యానీకి అదనపు రుచులు అందిస్తాయి. అంతే కాదు, రాజులు, మహారాజులు, సామాన్యులు -...ఇలా ఎవరైనా సరే హైదరాబాద్ బిర్యానీకి తలవంచి సలామ్ చెయ్యాల్సిందే. మరి బిర్యానీ ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా స్పెషల్ గా తయారు చేసుకుంటే ఆ మజాయే వేరు.
సాధారణంగా మనం వివిధ రకాలుగా బిర్యానినీ తయారుచేసుకుంటాం, ఈ రంజాన్ మాసంలో మరింత స్పెషల్ గా దమ్ కా బిర్యానీ తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది. చాలా సింపుల్ గా అతి తక్కువ మసాలా దినుసులతో తయారుచేసే ఈ చికెన్ దమ్ కా బిర్యానీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
చికెన్ : 1kg
బాస్మతి బియ్యం : 1kg
గరం మసాల : 2tsp
అల్లం వెల్లుల్లి ముద్ద : 1tsp
పెరుగు : 1cup
ఉల్లిపాయ ముక్కలు : 1/2cup
పచ్చి మిరపకాయలు : 5
ఎండు మిరపకాయలు : 6
పసుపు : చిటికెడు
కొత్తమీర : ఒక కట్ట
ఉప్పు : రుచికి తగినంత
నూనె : సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి కొద్దిగా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి.
2. తర్వాత బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక వంతు బియ్యానికి రెండొంతుల నీళ్లు పోసి స్టౌమీద మీద పెట్టి హాఫ్ బాయిల్ చేసుకొని, అదనపు గంజిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద మరో మందపాటి పాత్ర ఉంచి సరిపడా నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
4. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా పాత్రలో వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయాలి. ఇలాగే ఇంకో పొరలా మిగిలిన మాంసాన్ని, అన్నాన్ని వేసి మూత పెట్టాలి.
5. పాత్ర నుంచి ఆవిరి బయటకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. 6. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించుకోవలి. దీనికి సైడ్ డిష్‌గా గోంగూరను కానీ, వంకాయ కూరను కానీ వేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతే



Click it and Unblock the Notifications