Latest Updates
-
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.!
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
మీరెప్పుడైనా నిద్రలేవగానే తీవ్రమైన అలసట, చేతి వేళ్లు వంచడానికి కష్టంగా ఉండటం లేదా మోకాళ్లలో పట్టేసినట్లు అనిపించడం గమనించారా? చాలామంది దీనిని వయసు పైబడటం వల్లో, నిన్నటి పనిభారం వల్లో వచ్చిన సాధారణ నొప్పులు అనుకుని తేలిగ్గా తీసుకుంటారు. కానీ వైద్య భాషలో దీనిని మార్నింగ్ స్టిఫ్ నెస్ అంటారు. ఇది కేవలం అలసట కాదు, మీ శరీరంలో పొంచి ఉన్న అనారోగ్య సమస్యలకు ఇది ఒక హెచ్చరిక కావచ్చు.

అసలు ఉదయం పూట ఎందుకిలా జరుగుతుంది?
రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు శరీరం చాలా గంటల పాటు కదలిక లేకుండా ఉంటుంది. మన కీళ్ల మధ్య మృదువైన కదలికల కోసం సైనోవియల్ ద్రవం అనే ఒక సహజమైన గ్రీజు ఉంటుంది. విశ్రాంతి సమయంలో ఈ ద్రవం చిక్కబడుతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో నిద్రలేచి కొద్దిగా కదలగానే ఇది మళ్లీ పలచబడి కీళ్లు ఫ్రీ అవుతాయి.
కానీ కీళ్లలో వాపు ఉంటే ఈ బిగుతు గంటల తరబడి అలాగే ఉండిపోయి నరకం చూపిస్తుంది. వాతావరణంలో చలి పెరగడం, సరికాని భంగిమలో నిద్రపోవడం, వయసు పెరిగే కొద్దీ ఎముకల మధ్య ఉండే మృదులాస్థి అరిగిపోవడం లాంటివి కూడా కీళ్లు పట్టేయడానికి ప్రధాన కారణాలు.
ఈ ఉదయపు బిగువు ఏయే వ్యాధులకు సంకేతం కావచ్చు?
రుమటాయిడ్ ఆర్థరైటిస్
ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన శరీర రోగనిరోధక వ్యవస్థే పొరపాటున మన కీళ్లపై దాడి చేస్తుంది. దీనివల్ల చేతులు, కాళ్లలోని చిన్న కీళ్లు ఉదయం పూట తీవ్రంగా బిగుసుకుపోయి, వాపు, ఎరుపుదనం కనిపిస్తాయి.
ఆస్టియో ఆర్థరైటిస్
దీనిని అరుగుదల ఆర్థరైటిస్ అంటారు. ఇది వయసుతో పాటు వచ్చే సమస్య. మోకాలు, తుంటి, వెన్నెముకపై దీని ప్రభావం ఎక్కువ. నిద్రలేచిన 15-20 నిమిషాల తర్వాత నెమ్మదిగా ఈ బిగుతు తగ్గుముఖం పడుతుంది.
ఫైబ్రోమయాల్జియా
ఉదయం కండరాలు పట్టేయడంతో పాటు, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన అలసట, నిద్రలేమి ఉంటే అది ఫైబ్రోమయాల్జియా కావచ్చు. శరీరంలోని సున్నితమైన భాగాలపై చిన్నపాటి ఒత్తిడి పడినా వీరు తీవ్రమైన నొప్పితో విలవిలలాడుతారు.

ఈ నొప్పుల నుంచి ఉపశమనం ఎలా?
ఉదయం కళ్ళు తెరవగానే హడావిడిగా మంచం దిగేయకండి. పడకపైనే ఉంటూ మీ కాలి వేళ్లు, పాదాలు, చేతులను నెమ్మదిగా కదిలించండి. ఇది కీళ్లలో రక్తప్రసరణను పెంచుతుంది.
ఉదయాన్నే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం లేదా నొప్పులు ఉన్నచోట హీటింగ్ ప్యాడ్ తో కాపడం పెట్టుకోవడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.
వాపులను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న పసుపు, అల్లం, వాల్‌నట్స్, అవిసె గింజలను మీ డైట్ లో చేర్చుకోండి. విటమిన్ D లోపం లేకుండా చూసుకోండి.
నీళ్లు ఎక్కువగా తాగండి. శరీరంలో తగినంత నీరు ఉంటేనే కీళ్ల మధ్య ద్రవం చురుగ్గా పనిచేసి కదలికలను సులభతరం చేస్తుంది. ఈ చిట్కాలు తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ, ఈ సమస్య మిమ్మల్ని రోజూ వేధిస్తుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications