Latest Updates
-
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
హర్యానా ఎగ్ కర్రీ: గ్రేట్ కాంబినేషన్ విత్ రోటీ
హార్యానా ఎగ్ కర్రీ చాలా టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ కర్రీ . ఒక్కసారి రుచిచూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఎగ్ కర్రీ ఇది. ఈ స్పైసీ ఎగ్ కర్రీ రోటీ మరియు రైస్ కు ఒక మంచి కాంబినేషన్. అంతే కాదు బ్రెట్ కూడా మంచి టేస్ట్ గా ఉంటుంది.
ఇంకా లంచ్ బాక్స్ రిసిపికి కూడా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి, ఈ అద్భుతమైన రుచి కలిగిన హర్యానా ఎగ్ కర్రీని ఎలా తయారుచేయాలో ఈ క్రింది విధంగా చూడండి..

కావల్సిన పదార్థాలు:
గుడ్లు (ఉడికించిన): 4
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినవి)
టమోటా: 1(పేస్ట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 3-4
తాజా అల్లం పేస్ట్: 1-2
గ్రీన్ చిల్లీ: 1-2(సన్నగా తరిగినవి)
కారం: 1tsp
కొత్తిమీర తరుగు:1cup(సన్నగా తరిగాలి)
ఉప్పు : 1tsp
పసుపు: 1/2tsp
ధనియాలు పొడి 1 tsp
గరం మసాల 2-3 tbsp
నూనె / వెన్న: 1cup
పచ్చి బటానీలు: 1cup(అవసరం అయితే లేదా మీకు ఇష్టమైతేనే)
పనీర్ కొద్దిగా (అవసరం అయితే లేదా మీకు ఇష్టమైతేనే)
తయారుచేయు విధానం:
1. ముందుగా గుడ్లను ఉడికించి పైపొట్టు తీసి, పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి పనీర్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని పక్కన పెట్టుకవోాలి.
3. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా వేగించుకోవాలి.
4. అంతలోపు మిక్సీలో వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత ఫ్రై అవుతన్నపాన్ లో గరం మసాలా, గ్రైండ్ చేసుకొన్న అల్లం, వెల్లుల్లి ముద్ద మరియు టమోటో గుజ్జు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
6. తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి కొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.
7. తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టుకొన్న పనీర్, ఉడికించిన పచ్చిబటానీ మరియు గుడ్లను వేసి బాగా మిక్స్ చేసి తక్కువ మంటలో 15నిముషాలు ఉడికించుకోవాలి
8. మొత్తం మిశ్రం 15నిముషాలు ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా రైస్ మరియు రోటీలతో సర్వ్ చేయాలి. అంతే టేస్టీ హార్యానా ఎగ్ కర్రీ రెడీ.



Click it and Unblock the Notifications