Latest Updates
-
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా? -
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది -
హనుమాన్ జయంతి వేడుకలు: మాల విరమణకు సిద్ధమవుతున్నారా? భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే! -
శని దేవుడి కరుణ: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, మరికొందరికి కఠిన పరీక్ష! -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
హైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీ

అనగా అర్థమేమి...? ఐటమ్స్ అన్నిటా చేపల ఐటమ్స్ వేరయా అని తాత్పర్యం. మన ‘ఫ్యామిలీ'లో మీరు వెరీ వెరీ స్పెషల్. మీ కోసం మేం రెడీ చేసిన ఫిష్ బిర్యానీ ఇది. ఈ స్పెషల్ ఫిష్ డిష్ తినండి... ఖుష్ అవ్వండి...
కావలసినపదార్థాలు:
బోన్ లెస్ ఫిఫ్ పీసెస్: 500grms
పెరుగు: 1cup
నిమ్మకాయ: 1
నిమ్మరసం: 2tsp
ఉల్లిపాయ తరుగు: 1cup(వేయించినది)
నూనె: 1/2cup
కొత్తిమీర తరుగు: 1కట్ట
పుదీనా తరుగు: 1కట్ట
పచ్చిమిర్చి: 10(నిలువుగా చీరాలి)
గరం మసాలా: 1tsp
కారం: 1tsp
పసుపు: 1/2tsp
బాస్మతీ రైస్: 2cups
కెవ్రా వాటర్: 1tsp(మార్కెట్‌లో దొరుకుతుంది),
నెయ్యి: 2tbsp
డాల్డా: 2tsp
బిర్యానీ ఆకు: రెండు
జాజికాయ పొడి: 1/2tsp
ఏలుకల పొడి: 1/2tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4
రోజ్ వాటర్: 1tsp
అల్లం తరుము: 2tbsp
కుంకుమ పువ్వు: చిటికెడు
తయారు చేయు విధానం:
1. చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో చేప ముక్కలు, పెరుగు, నిమ్మరసం, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నిటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. ఈలోగా బియ్యం కడిగి 30 నిమిషాలపాటు నాననివ్వాలి. బియ్యంలో తగినంత ఉప్పు వేసి పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఏలకుల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, బిర్యాని ఆకులు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసి అన్నిటినీ దోరగా వేయించాలి. అందులో కప్పు నీళ్లు పోసి నానబెట్టిన చేప ముక్కలు, కాస్త ఉప్పు వేసి తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించాలి.
4. ఈ మిశ్రమం చిక్కబడ్డాక కుక్కర్ లో ఉడికిన అన్నం కొంచెం, చేప మిశ్రమం కొంచెం, డాల్డా, నెయ్యి, కుంకుమపువ్వు, రోజ్ వాటర్, కెవ్రా వాటర్ కొంచెం కొంచెం చొప్పున అన్నిటినీ లేయర్స్‌గా వేసి మూతపెట్టి తిరిగి అయిదారు నిమిషాలు ఉడికించాలి. అంతే హైదరాబాదీ ఫిష్ మసాలా బిర్యానీ రెడీ.
5. తినబోయే ముందు సర్వింగ్ బౌల్‌లో బిర్యానీని తీసుకుని వేయించిన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, నిమ్మచెక్కలతో గార్నిష్ చేయాలి. ఎంతో రుచికరమైన హైదరాబాది ఫిష్ మసాలా బిర్యానీ రెడీ.



Click it and Unblock the Notifications