Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
కోహినూర్ చికెన్ రిసిపి:వీకెండ్ స్పెషల్
ఈ వీకెండ్ లో స్పెషల్ గా తయారుచేసుకోవడానికి ఒక మంచి నాన్ వెజ్ రిసిపి కోహినూర్ చికెన్ రిసిపి . ఎప్పుడూ వండిన నాన్ వెజ్ వంటలను వండటం వల్ల బోరింగ్ గా ఉంటుంది. కాబట్టి, మీ టేస్ట్ బడ్స్ మరింత రుచికరంగా మారాలంటే, రెగ్యులర్ ఫుడ్ తో కొంచెం ప్రయోగం చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రయోగాలు చేయడానికి వీకెండ్స్ బాగా ఉపయోగపడుతాయి.
కోహినూర్ చికెన్ రిసిపి ఒక అద్భుతమైనటువంటి చికెన్ రిసిపి. ఇది ఒక అద్భుతమైనటువంటి రుచికరమైన కొత్త వంట, మీరు టేస్ట్ బడ్స్ కు కొత్తగా రుచిచూపించాలంటే ఈ కోహినూర్ చికెన్ రిసిపిని ప్రయత్నించండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్ : 1kg
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లిపేస్ట్: 1tsp
టమోటో గుజ్జు: 1/2cup
నిమ్మరసం: 1tsp
ఉప్పు & పెప్పర్: రుచికి సరిపడా
గరం మసాలా: 1tsp
కుంకుమ పువ్వు లేదా ఫుడ్ కలర్: చిటికెడు
మైదా : 2tbsp
పుదీనా: కొద్దిగా
కరివేపాకు: రెండు రెమ్మలు
ఎండు మిర్చి: 2-4
నూనె: 2tbsp
తాజా క్రీమ్: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెప్పర్, కారం, నిమ్మరసం, గరం మసాలా మరియు కుంకుమ పువ్వు వేసి, బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు చికెన్ ముక్కలకు పట్టించిన మసాలాలు విడిపోకుండా మైదాలో చల్లడం లేదా మైదాలో పొర్లించడం వల్ల మసాల మరియు ఫ్లేవర్ పోకుండా ఉంటుంది.
3. తర్వాత పెద్ద పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి నూనె వేసి కాగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే నూనెలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి.
5. తర్వాత టమోటో గుజ్జు మరియు ఫ్రెష్ క్రీమ్ (లేదా కొబ్బరి పాలు)వేసి ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొన్న చికెన్ ముక్కలను వేసి రుచికి సరిపడా ఉప్పు మరియు మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ గ్రేవీ మొత్తం చికెన్ ముక్కలకు పట్టేవరకూ ఫ్రై చేసుకోవాలి.
7. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర, పుదీనా తరుగును వేసి గార్నిష్ చేయాలి. అంతే కోహినూర్ చికెన్ రిసిపి రెడీ.
8. ఈ కోహినూర్ చికెన్ రిసిపిని మటర్ పులావ్ లేదా బటర్ నాన్ తో తిని ఎంజాయ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications