Latest Updates
-
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
మసాలా పంప్లేట్ ఫిష్ రోస్ట్

పంప్లేట్ ఫిష్: 4
కోడి గ్రుడ్లు: 1
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tbsp
కారం: 1tsp
పసుపు: 1tsp
చిల్లి సాస్: 1tbsp
సోయ్ సాస్: 1tbsp
కార్న్ ఫ్లోర్: 1tbsp
మైదా: 1tbsp
ఉప్పు: 1tsp
గార్నిష్ కొరకు
ఉల్లిపాయలు: 1
కారట్: 1
బీన్స్: 4
తయారు చేయు విధానము:
1 . మొదటగా 4పంప్లేట్ చేప నీటి శ్రుభ్రపరిచి తర్వాత ముక్కలకు కత్తితో ఘాట్లు పెట్టాలి. చేప రెండు వైపులా ఘాట్లు పెట్టాలి
2. ఇప్పుడు తగినంత కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లి సాస్, సోయ్ సాస్. కార్న్ ఫ్లోర్, మైదా కోడి గ్రుడ్లు, వైట్ పెప్పర్ , చిటికెడు అజినోమోటో, ఉప్పు, ఆరెంజ్ కలర్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ముద్దలు లేకుండా బాగా కలుపుకొని ఆ పేస్ట్ ని పక్కన పెట్టుకోవాలి.
3. ఇలా తాయారు చేసుకున్న మసాలను చేపకు పట్టించి 4-5 గంటలు ఉంచాలి. చేప ను చేతిలోకి తీసుకుని కొంచం వంచి మసాల అంత ఘాట్లు మధ్య అంత రాయాలి. చేపకు మొత్తం రాయాలి రెండు వైపులా.
4. ఈలోపు గార్నిష్ కొరకు ఉంచిన కూరగాయలను తీసుకుని సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఇందులో వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
5. ఒక పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. చేప పైన ఉన్న మాసాలను తీసి నూనె లోకి జాగర్తగా వేయాలి. చేప రెండు వైపులా సగం ఉడికించాలి.
6. ఉడికాక తయారు చేసిన కూరగాయలతో గార్నిష్ చేసుకుని వేడి వేడి, రుచికరంగా ఉండే పంప్లేట్ ఫిష్ రోస్ట్ రెడీ.



Click it and Unblock the Notifications