Latest Updates
-
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది!
మింట్ మటన్ బిర్యానీ-స్పెషల్ ఫ్లేవర్ అండ్ టేస్ట్
సాధారణంగా బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన డిష్. బిర్యానీలో కూడా వివిధ రకాలుగా తయారు చేస్తారు. చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ. రుచిలో వేటికవే అద్భుత రుచి, ఒక్కో వంటకాన్నీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మటన్ బిర్యానీ చేయాలంటే వివిధ రకాల మసాల దినుసులు అవసరం అవుతాయి.
కానీ పుదీనా మటన్ బిర్యానీ చాలా సింపుల్ గా రుచికరంగా, మంచి ఫ్లేవర్ తో అతి త్వరగా తయారు చేసుకోవచ్చు. అతి తక్కువ మసాలా దినుసులతో తాయరు చేసే మటన్ బిర్యా టేస్ట్, ఫ్లేవర్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి మీరూ పుదీనా ఫ్లేవర్ మటన్ బిర్యానీ రుచి చూడాలంటే ఎలా తయారు చేయాలో ఒక సారి చూద్దాం...

కావలిసిన పదార్థాలు:
పుదీన : 3cup
ఉల్లిపాయలు : 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నిమ్మకాయలు : 2
ఉప్పు : రుచికి సరిపడ
ఫుడ్ కలర్ : చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tsp
బాస్మతి రైస్ : 3cup(ఆఫ్ బాయిల్డ్ చేయాలి)
ధనియాలపొడి : 1tsp
నూనె : తగినంత
బిర్యానీ మసాలా : 1tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా కుక్కర్‌లో మటన్ ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించి తీయాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో కొద్ది నూనె వేసి, కాగిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పక్కన తీసి పెట్టుకోవాలి.
3. చల్లారిన తర్వాత కారం, ఉప్పు, పెరుగు, బిర్యానీ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి డీప్ ఫ్రిజ్‌లో అరగంట పెట్టాలి. ఇలా చేస్తే మసాలా మొత్తం మటన్‌కి బాగా పడుతుంది.
4. అంతలోపు రైస్‌ను ఆఫ్ బాయిల్ చేసి విడిగా పెట్టుకోవాలి.
5. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకొన్న మటన్ ముక్కలను ఒక పొరగా పరచి, దానిపైన ఉల్లిపాయల పొర, దాని పైన పుదీనా, ఆ పైన ఆఫ్ బాయిల్డ్ రైస్, తర్వాత మటన్, ఆ పైన ఉల్లిపాయలు, ఆ పైన పుదీనా, కొత్తిమీర ఆ పైన ఆఫ్ బాయిల్డ్ రైస్‌తో... నీటుగా సర్దాలి.
6. తర్వాత ఫుడ్‌కలర్‌ని ఒక టీ స్పూన్ నీళ్లలో కలిపి పైన చిలకరించాలి. పైన మూత పెట్టి, ఆవిరి బయటకు పోకుండా గోధుమ పిండి ముద్దతో గిన్నెను, మూతను కలిపి కవర్‌చేయాలి. తర్వాత సన్నని మంటమీద ఇరవై నిమిషాలు ఉడికించి, దించాలి. అంతే పుదీనా మటన్ బిర్యానీ రెడీ. ఈ పుదీనా బిర్యానీ మీకు నచ్చిన రైతా లేదా మీకు నచ్చిన గ్రేవీతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications