Latest Updates
-
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026
మటన్ కిచిడి

మటన్ : 1/2kg (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినది)
పెసరపప్పు: 1cup
నూనె : 1cup
బియ్యం : 2 cup
ఉల్లిపేస్టు : 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్టు : 2tbsp
టమాటా గుజ్జు : 4tsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
గరం మసాలా పొడి : 1tsp
నిమ్మరసం : 2tsp
యాలకులు: 2
ఉప్పు : రుచికి సరిపడినంత
తయారు చేయు విధానం:
1. మటన్ ను అల్లం వెల్లుల్లి, ఉల్లి, నిమ్మరసం, పచ్చిమిర్చి సేప్ట్, ఉప్పు కలిపిన మిశ్ర మంలో 1 గంట సేపు ఊరనివ్వాలి.
2. తర్వాత బియ్యం, పెప్పుకు రెండొంతుల నీళ్ళలో అన్నం, పప్పు సెపరేట్ గా వండి పక్కన పెట్టు కోవాలి.
3. ఇప్పుడు అర కప్పు నీరు కుక్కర్ లో పోసి ఆ నీరు పూర్తిగా ఇగిరి పోయే వరకు మటన్‌ను ఉడికిం చాలి.
4. తర్వాత పాన్ లో నూనె వేసి మాసం ముక్కలు ఎర్రగా వేగే వరకు వేయించాలి.
5. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె అలాగే ఉంచి మిగిలినది పాన్ లో నుండి తీసేయాలి. ఇప్పుడు సౌ మీద పాన్ అలాగే ఉంచి సెగ తగ్గించి టొమాటో గుజ్జు అందులో వేయాలి. రెండు నిమిషాల తర్వాత మటన్ కూడా వేసి కొద్ది సేపు వేగనివ్వాలి. ఇందులో ఉడికించి పెట్టుకొన్న పెసరపప్పు, అన్నం కలిపి రెండు నిమిషాలు వేడిచేయాలి. అంతే మటన్ కిచిడి రెడీ. దీనిని ఏదేని చెట్నీతో వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications