Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
అద్భుతమైన టేస్ట్ - పైనాపిల్ ఫిష్
అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో పైనాపిల్ ఫిష్ కూడా ఒకటి. ఫైనాఫిల్ ఫిష్ టేస్ట్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఫైనాపిల్ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ ఫ్రై. ఈ ఫైనాపిల్ వంటకం ఏ సందర్భంలోనైనా వండుకోవచ్చు. ఈ రుచికరమైన వంటకం ఫ్యామిలీ మెంబర్స్ కు, అతిథులకు అందించడమే కాకుండా ఫిష్ లవర్స్ నుండి ప్రసంశలను పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు టేస్ట్ చూసేయండి...

కావలసిన పదార్థాలు:
సాల్మన్, ట్యూనా లేదా ఫిల్లెట్ ఫిష్ : 4
ఆవాలు: 1/2tsp
పచ్చిమిర్చి: 4-6(మద్యలోనికి కట్ చేయాలి)
మస్టర్డ్ సాస్: 4-5tbsp(మార్కెట్లో దొరుకుతుంది)
పసుపు: 1tsp
కారం: 2tsp
పైనాపిల్ ముక్కలు: 2cups
ఉప్పు : రుచికి తగినంత
మస్టర్డ్ ఆయిల్ లేదా వెజిటేబుల్ ఆయిల్: ఫ్రైకి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఫిష్ ఫిల్లెట్ ను శుభ్రం చేసి ఒక పాన్ లో నిండుగా నీళ్ళు పోసి అందులో ఫిష్ ఫిల్లెట్ చేపముక్కలను వేసి స్టౌ మీద పెట్టి మీడియం మంట మీద 5-10నిమిషాలు ఉడికించుకోవాలి.
2. పది నిమిషాల తర్వాత స్టౌ మీద నుండి దించి పాన్ లోని నీటిని వంపేసి ఫిష్ ను పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు లోతైన ఫ్రైయింగ్ పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి అందులో వెజిటేబుల్ ఆయిల్ వేసి తక్కువ మంటను పెట్టాలి.
4. తర్వాత నూనె వేడి అవ్వగానే అందులో ఆవాలు వేసి చిటపటలాడాక, అందులో పచ్చిమిర్చి ముక్కలు, మస్టర్డ్ సాస్, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి తక్కువ మంటలో రెండు మూడే నిమిషాలు వేగనివ్వాలి. (ఒక వేళ ఫ్రై పొడిపొడిగా ఉన్నట్లైతే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు).
5. ఇప్పుడు వేగుతున్న మసాలా ఫ్రైలో ముందుగా ఉడికించి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ వేసి సున్నితంగా ఒక సారి మిశ్రమాన్నంతటిని కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోనే ఫైనాపిల్ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇవి కూడా ఒక నిమిషం పాటు వేగనించి తర్వాత క్రిందికి దింపుకోవాలి. అంతే సర్వ్ చేయడానికి ఫైనాపిల్ ఫిష్ ఫ్రై రెడీ. పైనాపిల్ ఫిష్ ను వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications