కొంకన్ స్టైల్ ప్రాన్స్ రిసిపి: సీఫుడ్ స్పెషల్

మన ఇండియాలోని కేరళ రాష్ట్రంలోని కొంకన్ లో సీఫుడ్స్ అంటే చాలా పాలపుర్ . అక్కడ చాలా డిఫరెంట్ సీఫుడ్స్ వివిధ రకాల రుచులతో తయారుచేసినవి మనకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఫిష్, మరియు ప్రాన్స్ తో తయారు చేసే వంటలు ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంటాయి. అటువంటి వంటకాల్లో ఒక స్పెషల్ వంట ప్రాన్ రిసిపి.

కొంకన్ స్టైల్ ప్రాన్ రిసిపి ఒక ట్రెడిషినల్ రిసిపి. చాలా తక్కువ మసాలా దినుసులతోనే దీన్ని చాలా సింపుల్ గా త్వరగా తయారుచేస్తారు. ప్రాన్స్ ను వండటానికి ముందుగానే మ్యారినేట్ చేయడం వల్ల ఎక్కువ రుచి కలిగి ఉంటుంది. కొంకన్ స్టైల్ ప్రాన్ కర్రీ రైస్ కు ఒక బెస్ట్ కాంబినేషన్. మరి ఇంకెదుక ఆలస్యం మీరు సీఫుడ్ లవర్స్ అయితే, కొంకన్ స్టైల్ ప్రాన్ కర్రీ ట్రై చేసి ఎంజాయ్ చేయండి....

Prawns Recipe Konkan Style

కావల్సిన పదార్థాలు:
ప్రాన్స్: 1kg
ఉల్లిపాయలు: 3 (పెద్దవి, సన్నగా తరిగి పెట్టుకోవాలి)
టమోటో: 3(పెద్దవి, సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర: కొద్దిగా (తరిగి పెట్టుకోవాలి)
నూనె: 4tsp
వెల్లుల్లి: 3tsp
పసుపు: 1tsp
చింతపండు: 1tsp
కారం: 1tsp
లవంగాలు: 2
దాల్చిన చెక్క: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్ (రొయ్యల)ను శుభ్రం చేసుకొని, వాటికి వెల్లుల్లి, పసుపు, కారం, చింతపులు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 15-30నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ తీసుకొని, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో లవంగాలు మరియు దాల్చిన చెక్క వేసి ఒకనిముషం వేగించుకోవాలి.
3. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. 5నిముషాల తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ప్రాన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే టమోటో ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి, 5నిముషాలు సిమ్ లో పెట్టి ఉడికించాలి. ప్రాన్స్ ష్రింక్ అయ్యే వరకూ ఫ్రై చేయాలి. ఫ్రై అవ్వుతున్న సాస్ నుండి ఆయిల్ విడిపోవడాన్ని గమనించండి.
6. ఇప్పుడు అందులోనే కొత్తిమీర తరుగు, మరియు అవసరం అయితే ఉప్పు వేసి మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి. అంతే కొంకన్ స్టైల్ ప్రాన్ కర్రీ రెడీ. దీన్ని రైస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

Desktop Bottom Promotion