Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
క్విక్ అండ్ స్పైసీ ఎగ్ కర్రీ: బ్యాచులర్ స్పెషల్
బాగా ఆకలిగా ఉన్నప్పుడు, సమయం లేనప్పుడు వెంటనే ఏదైనా తయారయ్యే వంటఏదైనా ఉంటే బాగుండనుకుంటారు. అటువంటి వాటిలో ఎగ్ కర్రీ ఒకటి. చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు . ఈ ఎగ్ కర్రీనీ 15నిముషాల్లో తయారుచేసుకోవచ్చు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వారికి, ఉద్యోగస్తులకు ఇటువంటి వంటలు చాలా బాగా హెల్ప్ అవుతాయి.
మీ భోజనం సంతృప్తి పరిచే వస్తువుల్లో గుడ్డు ఒకటి, ఇది కిరాణా షాంపుల్లో గుడ్లు చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయి. అంతే కాదు, వీటిని తీసుకొచ్చి మన టేస్ట్ కు తగ్గట్టు, కొంచెం స్పైసీగా తయారుచేసుకుంటే, ఇక అంతే, లొట్టలేసుకుంటూ తినేయడమే ఆలస్యం. అంతే కాదు, గుడ్డులో ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉండటం వల్ల, ఇది ఆరోగ్యకరమైనది కూడా. తక్షణం ఎనర్జీ లెవల్స్ ను అంధిస్తుంది. మరి ఈ హెల్తీ మీల్ సైడ్ డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 3(ఉడికించి మరియు ఎగ్ సెల్ తొలగించి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ పేస్ట్: 2tbsp
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tsp
టమోటో గుజ్జు: 2tbsp
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: 1tsp
ధనియా పొడి: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
దాల్చినచెక్క: 1
లవంగాలు: 4-5
బిర్యానీ ఆకు: 1
నూనె: 2tbsp
తయారుచేయు విధానము:
1. ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేగించుకోవాలి.
2. ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
3. తర్వాత అందులో పసుపు, కారం, ధనియాపౌడర్, గరం మసాలా, ఉప్పు, పంచదార కూడా వేసి మరో 3-4నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే టమోటో గుజ్జు కూడా వేసి మీడియం మంట మీద మరో 5నిముషాలు వేగించాలి.
5. ఇప్పుడు అందులో అరకప్పు నీళ్ళు పోసి రెండు నిముషాలు, షిమ్మర్ లో పెట్టి బాగా ఉడికించాలి.
6. గ్రేవీ బాగా ఉడికి, చిక్కబడిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న గుడ్లు అందులో వేసి, బాగా మిక్స్ చేయాలి. ఒక ఐదు నిముషాలు అలాగే సిమ్ లో ఉంచి తర్వాత స్టౌ ఆఫ్ చేసి తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే క్విక్ అండ్ స్పైసీ ఎగ్ కర్రీ రెడీ. ఇది గీ రైస్ కు చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications