Latest Updates
-
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
రాయలసీమ బిర్యానీ

బాస్మతి బియ్యం : 1/2kg
చికెన్ ముక్కలు : 1kg
గరం మసాలా పౌడర్ : 1/2cup
పాలు : 1/2cup
డాల్డా : 500grm
ఉల్లిపాయలు : 1cup
ఎర్రగా వేయించిన ఉల్లిగడ్డలు : 2cups
వెల్లుల్లి : 1cup
గులాబీ నీరు : 2 tbsp
అల్లం : 4tbsp
ఆయిల్ : 5tbsp
కారం : 3tbsp
ఉప్పు : రుచికి సరిపడినంత
దనియా పొడి : tbsp
కుంకుమ పువ్వు :1tsp
పెరుగు : 2cups
బిరియాని ఆకు : 4
టమేటో :1/2cup
తయారు చేయు విధానం :
1. ముందుగా చికెన్ ముక్కలను తీసుకుని వాటికి తగినంత ఉప్పు, అరచెంచా కారం, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, అరచెంచా పసుపు, పెరుగు అన్నీ కలిపి ఓ గంట పాటు పక్కన పెట్టి నాననివ్వాలి.
2. బాస్మతి బియ్యాన్ని కడిగి ఓ అరగంట పాటు నానబెట్టాలి. తరువాత నీటిని వేడి చేసి అందులో గరం మసాలా పౌడర్ రెండు చెంచాలు వేయాలి. బిర్యాని ఆకు కూడా వేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు చేసి మూడొంతులు బియ్యం ఉడికే వరకు ఉంచాలి. తరువాత నీటిని ఒంపేసి అన్నాన్ని పక్కనపెట్టుకోవాలి.
3. తరువాత నూనెను వేడి చేసి మిగిలిన గరంమసాలా మొత్తం వేసేయాలి. కొద్దిగా వేగనిచ్చి అందులో ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ రంగులో వచ్చే వరకు వేయించాలి. అల్లం ముక్కలు, వెల్లుల్లి, దనియాల పొడి, పసుపు, కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా టమోటా ముక్కలు వేయాలి. వీటిని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇందులో చికెన్ ముక్కలు వేసి చికెన్ బాగా ఉడికే వరకు స్టౌ మీద పెట్టాలి.
4. పాలు వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఇప్పుడు పెద్ద పాత్ర తీసుకుని రైస్ ని, చికెన్ ని లేయర్స్ లాగా వేయాలి. మధ్యలో కుంకుమ పువ్వు కలిపిన పాలను వాటిమీద చిలకరించాలి.
5. మిగిలిన గరం మసాలా, పుదీనా ఆకులు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఈ లేయర్స్ మధ్యలో వేయాలి. మద్యలో డాల్డాను, పైన వేయాలి. అన్ని బాగాల్లో కుంకుమ పువ్వు పాలు కలిసేలా ఉండేట్లు చూడాలి. అలాగే గులాబీ నీటిని కూడా కొద్దిగా చిలకరించాలి.
6. ఇప్పుడు పాత్ర పైభాగాన్ని అల్యూమీనియం పేపర్ తో కవర్ చేయాలి. 20 నిమిషాల పాటు ఆవిరిలో మగ్గనివ్వాలి. అంతే రాయసీమ బిర్యాని రెడీ.



Click it and Unblock the Notifications