Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
సాల్మన్ ఫిష్ ఫ్రైడ్ రైస్ - సండే స్పెషల్ డిష్
కావలసిన పదార్థాలు:
సాల్మన్ ఫిల్లెట్: 1kg
నిమ్మరసం: 4-5tbsp
కారం: 2tbsp
అల్లం: 1tbsp
వెల్లుల్లి: 2tbsp
యాలకులు: 2
లవంగాలు: 2-3
చెక్క: 2-3
ఉల్లిపాయ: 1cup(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
కార్న్(మొక్కజొన్న గింజలు): 1cup
క్యారెట్: 1/2cup(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిబఠాణి: 1/2cup
జీడిపప్పు: 1cup
సోయా సాస్: 1cup
పంచదార: 1tsp
బాస్మతి రైస్: 1/2kg
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం, కారం, ఉప్పు, వేసి బాగా మిక్స్ చేసి అందులో శుభ్రం చేసుకొన్న సాల్మన్ ఫ్లిలెట్ (చేప) ముక్కలను అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2. బాస్మతి రైస్ ను శుభ్రంగా కడిగి పొడి పొడిగా ఉడికించి పక్కన తీసి ఆరబెట్టుకోవాలి.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు లేదా పేస్ట్ వేసి వేయించుకోవాలి. అదే నూనెలో నానబెట్టి పెట్టుకొన్న చేపముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు మరో ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో మరికొంచె నూనె వేసి వేడి అయ్యాక అందులో చితగొట్టిని యాలకలు, లవంగాలు, చెక్క వేసి తక్కువ మంటలో వేయించుకోవాలి.
5. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, కార్న్, క్యారెట్, ఉడికించిన పచ్చిబఠాణి, జీడిపప్పు, మరియు కొద్దిగా ఉప్పు కూడా చేర్చి బాగా వేయించాలి. ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ఆ మిశ్రమానికి సోయా సాస్, పంచదార వేసి కలపాలి. ఈ మిశ్రమాన్నంత మరికొంత సేపు వేయించుకవాలి.
6. ఇప్పుడు అందులో ఫిష్ ఫిల్లెట్ ముక్కలు, వండుకున్న అన్నం వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్నిఅతి తక్కువ మంటలో రెండు మూడు నిమిషాలు ఉంచాలి. అంతే ఫిష్ ఫ్రైడ్ రైస్ రెడీ. హాట్ హాట్ గా ఈసండే సర్వ్ చేసి రుచి చూసేయండి మరి......



Click it and Unblock the Notifications