షహీ కోఫ్తా షొర్బా రిసిపి : రంజాన్ స్పెషల్

రంజాన్ నెల ప్రారంభమైందంటే డిఫరెంట్ టేస్ట్ లతో మాంసాహార రుచులు అలరిస్తుంటాయి. ఉపవాసం తర్వాత తీసుకొనే ఆహారం చాలా ముఖ్యమైనది మరియు అవసరం అయినది. ఎందుకంటే రోజంతా పచ్చి మంచినీళ్ళ కూడా త్రాగకుండా కఠినంగా ఉపవాసం చేయడం వల్ల శరీరంలో క్యాలరీలు కరిగి, ఎనర్జీ తగ్గిపోతుంది . తిరిగి ఆ శక్తిని పొందడానికి ఎక్కువ ప్రోటీనుల మరియు న్యూట్రీషియన్స్ ఉన్న ఆహారం ను తీసుకోవల్సి ఉంటుంది.

ఎక్కువ ప్రోటీనులున్న ఆహారం మటన్. కాబట్టి, ఉపవాసంలో కోల్పోయిన న్యూట్రీషియన్స్ తిరిగి పొందడానికి మటన్ తో తయారుచేసి రిసిపిలు ఉత్తమం . అందుకే ఇఫ్తార్ కు ఎక్కువగా మాంసాహారాలనే వండుతుంటారు . ఈ రంజాన్ నెలలో స్పెషల్ గా మీకోసం ఒక షహీ కోప్తా షొర్భా రిసిపి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Shahi Kofta Shorba Recipe For Ramzan

కావల్సిన పదార్థాలు:
కోఫ్తాకు కావల్సిన పదార్థాలు:
బీఫ్: 500grms
గుడ్డు: 1(పగులగొట్టిలోపలి సొన తీసుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లల్లి: 2tsp
పచ్చిమిర్చి: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర: 1కట్ట(సన్నగా తరగాలి)
పుదీనా: 1/2 కట్ట(సన్నగా తరగాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ప్రైయింగ్
కర్రీ కోసం కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయలు: 3(సన్నగా తరగిపెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
టమోటో: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
ధనియాల పొడి: 1tsp
యాలకులపొడి: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
నీళ్ళు: 1cup
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఫ్రెష్ క్రీమ్ : 2tbsp


తయారుచేయు విధానం:

1. ముందుగా మటన్ ను శుభ్రంగా కడగాలి.
2. తర్వాత కోఫ్తాలకు సిద్దం తీసుకొన్న పదార్థాలన్నింటిని ఒక మిక్స్ బౌల్లో వేసి (నూనె మినహాయించాలి)అన్నింటిని బాగా మిక్స్ చేయాలి.
3. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి.
4. డీప్ ఫ్రౌయింగ్ పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత కోఫ్తా ఉండలను, కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
5. నూనెలో కోఫ్తాలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకూ మీడియం మంట మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
7. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2, 3 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. తర్వాత టమోటో, పసుపు, కారం, ధనియాలపొడి, గరం మసాలా, ఉప్పు వేసి 5నుండి6 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
9. కొద్దిగా నీళ్ళు పోసి చిక్కటి గ్రేవీ అయ్యే వరకూ 2-3నిముషాలు ఉడికించుకోవాలి.
10. గ్రేవీ చిక్కబడిన తర్వాత అందులో ఫ్రైడ్ కోఫ్తాలను వేసి, మూత పెట్టి 10-15నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
11. తర్వాత మూత తీసి, యాలకుల పొడి చిలకరించి , కోఫ్తాలు పూర్తిగా ఉడికిన తర్వాత , స్టౌ ఆఫ్ చేయాలి.
12. చివరగా కొత్తిమీర తరుగు మనరియు ఫ్రెష్ క్రీమ్ త గార్నిష్ చేయాలి. అంతే షహీ కోఫ్తా షొరబ రెడీ . ఈ రుచికరమైన బీఫ్ రిసిపిని రోటి లేదా పరోటాలతో సర్వ్ చేయండి.

Story first published: Thursday, July 3, 2014, 11:57 [IST]
Desktop Bottom Promotion