Latest Updates
-
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి
సౌంత్ ఇండియన్ స్టైల్ ఫిష్ ఫ్రై రిసిపి
ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే. ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. అది సౌత్ ఇండియన్ ఫిష్ కర్రీలు, ఫ్రైలు చాలా వెరైటీ రుచులతో ఉంటాయి. చేపలంటే చాలా మంది ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో ఆంధ్రా ఫిష్ కూడా ఒకటి. ఆంధ్రా ఫిష్ టేస్ట్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఆంధ్రా స్టైల్ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. ఈ ఫిష్ ప్రైను ఏప్పుడైనా, ఏ సందర్భంలోనైనా వండుకోవచ్చు. ఈ రుచికరమైన వంటకం ఫ్యామిలీ మెంబర్స్ కు, అతిథులకు అందించడమే కాకుండా ఫిష్ లవర్స్ నుండి ప్రసంశలను పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మీరు టేస్ట్ చూసేయండి...

Image Courtesy: sharmispassions
కావల్సిన పదార్థాలు:
చేపలు: 1/2kg
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 5
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
లవంగాలు: 8
దాల్చిన చెక్క: 4
ధనియాలపొడి: 2tbsp
కారం: 2tbsp
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా చేపలను పల్చగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి అన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. తర్వాత ఈ పేస్ట్ లో కారం, ఉప్పు, పసుపు, ధనియాలపొడి కలిపి పలుచగా కట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను రెండు వైపులా ఈ మసాలాను పట్టించాలి.
4. మసాలా పట్టించిన ఈ చేప ముక్కలను 2,3గంటలు మారినేట్ చేసుకోవాలి.
5. పాన్ లో నూనె పోసి బాగా కాగిన తర్వాత మారినేట్ చేసిన చేపముక్కలను నూనెలో వేసి రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వేయించుకోవాలి.
6. ఇలా అన్ని ముక్కలు వేయించి, సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకొన్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications