స్పైసీ చికెన్ మంచూరియన్ రిసిపి

కొన్ని రకాల చైనీస్ చికెన్ రిసిపిలు చాలా పాపుర్ గా ఉన్నాయి . ముఖ్యంగా మన ఇండియన్స్ కూడా చాలా వరకూ చైనీస్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చైనీస్ వెజ్ మరియు నాన్ వెజ్ వంటల్లో డిఫరెంట్ వంటలు కూడా ఉన్నాయి. నాన్ వెజ్ వంటల్లో చైనీస్ చిల్లీ చికెన్ లేదా చిల్లీ మంచూరియా వంటివి చాలా పాపులర్ రిసిపి. మంచూరియన్ వంటల్లో చికెన్ మంచూరియాలా మన ఫేవరెంట్ ఫుడ్. దీన్ని స్నాక్ గా లేదా చైనీస్ ఫ్రైడ్ రైస్ గా తీసుకుంటారు.
చైనీస్ చికెన్ మంచూరియన్ ఇంట్లో తయారుచేయడం అంత కష్టమైన పనేం కాదు, చాలా సులభంగా మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అంతే కాదు, ఈ వంటకు మనకు తెలిసిన పదార్థాలనే ఉపయోగిస్తాము. చాలా సింపుల్ పదార్థాలతో టేస్టీగా తయారుచేసే చికెన్ మంచూరియన్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Chicken Manchurian Recipe

కావల్సిన పదార్థాలు:

చికెన్ (ఎముకలు లేనివి): ½ kg
కార్న్: 1cup
గుడ్లు: 2(బీట్ చేసి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 6 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
సోయా సాస్: 3tbsp
టమోటో సాస్: 2tbsp
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1tsp
వెల్లుల్లి రెబ్బలు: 4 (తరిగిన)
అల్లం: 1 అంగుళం
క్యాప్సికమ్: 1
కొత్తిమీర తరుగు: 2tbsp
అజినోమోటో: ½tsp
నూనె: 1cup
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, గుడ్డు, రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, ఉప్పు, మరియు అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులోనే అరకప్పు వార్మ్ వాటర్(గోరువెచ్చని నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేయాలి.
3. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు తీసుకొని ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిలో డిప్ చేసి కాగే నూనెలో వేయాలి.
4. మీడియం మంట మీద చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి తీసి టిష్యు పేపర్ మీద వేసి పెట్టాలి.
5. తర్వాత మరో పాన్ లో రెండు చెంచాలా నూనె వేసి, వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి వేయాలి.
6. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి, మిక్స్ చేస్తూ రెండు నిముషాలు తక్కువ మంట మీద ఫ్రై చేయాలి.
7. తర్వాత అందులోనే సోయాసాస్, టమోటో కెచప్ మరియు అజినామోటో కూడా వేసి మరో నిముషం వేగించుకోవాలి.
8. తర్వాత కొత్తిమీర తరుగు వేసిమిక్స్ చేసి, అరకప్పు నీళ్ళు పోయాలి. అలాగే డీప్ ఫ్రై చేసుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
10. స్టౌ ను సిమ్ లో పెట్టి, మరో 5 నముషాలు ఉడికించుకోవాలి. అంతే చికెన్ మంచూరియన్ రెడీ.

Story first published: Thursday, September 18, 2014, 12:50 [IST]
Desktop Bottom Promotion