స్పైసీ చికెన్‌ ఆమ్లెట్‌

Chicken Omelette
కావలసిన పదార్థాలు:
చికెన్: 100grms
కోడిగుడ్లు: 4
కారం: 1tsp
మిరియాలపొడి: 1tsp
కొత్తమీర తరుగు: 1/2cup
నిమ్మరసం: 1tsp
ఉల్లిపాయ తరుగు: 1/2cup
అల్లం పేస్ట్‌: 1tsp
పచ్చిమిర్చి: 4(చిన్న చిన్న ముక్కలుగా చేసినవి)

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్‌ ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్‌ మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడికించాలి. ఉడికించిన చికెన్‌ను పాత్రలోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
2. తర్వాత రెండు కోడిగుడ్లు, కారం, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, అల్లం పేస్ట్ లను బాగా గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమంలో కలపాలి.
3. ఇప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలు చేసిన చికెన్‌ ను చేర్చాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పెనంమీద ఆమ్లెట్‌ లా పోసుకుని రెండు వైపులా వేడివేడిగా సర్వ్‌ చేయొచ్చు.

Story first published: Tuesday, June 26, 2012, 16:09 [IST]
Desktop Bottom Promotion