Latest Updates
-
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది!
స్పైసీ మసాలా ఎగ్ పెప్పర్ ఫ్రై

కావలసిన పదార్థాలు:
గుడ్లు: 6
ఉల్లిపాయలు: 2
టమోటో: 1
కరివేపాకు: రెండు రెమ్మలు
అల్లం: చిన్న ముక్క
కారం: 1tsp
వెల్లుల్లిపాయలు: 6-8
గరం మసాలా: 1tsp
పెప్పర్ పౌడర్: 1tsp
కొత్తిమీర తరుగు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1/2tsp
శెనగపప్పు: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా గుడ్లును ఒక గిన్నెలో కావలసినంత నీళ్ళు పోసి అందులో ఉడికించి, స్టౌ మీద నుండి దింపుకొని ఐదు నిమిషాల తర్వాత పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, శెనగపప్పు, కరివేపాకు, వేసి దోరగా వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులో అల్లం తురుమును, వెల్లుల్లి ముక్కలు మరియు సన్నగా తరిగిపెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
4. ఐదు నిమిషాల తర్వాత టమోటో ముక్కలను కూడా వేసి బాగా వేగనివ్వాలి. టమోటో మెత్తగా నూనెలో ఉడికిన తర్వాత కారం, గరం మసాలా వేసి మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
5. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి కలబెట్టి కొద్దిగా నీళ్ళను చల్లి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి.
6. ఇప్పుడు ఉడికించి పెట్టుకొన్న కోడి గుడ్లును ఒక్కోదాన్ని రెండు లేదా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని స్టౌ మీద వేగుతున్న మసాలాలో వేసి సున్నితంగా కలియబెట్టాలి. (గుడ్డులోని పసుపు పదార్థం మసాలాకు అంటుకోకుండా )ఫ్రై చేయాలి.
7. చివరగా పెప్పర్ పౌడర్ ను, కొత్తిమీర తరుగును చల్లి ఒక నిమిషం తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే సర్వ్ చేయడానికి వేడి వేడి మసాలా ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ....ఇది ఏదైన వెరైటీగా చేసుకొన్న రైస్ కు లేదా పలావ్, మరియు బిర్యానికి కూడా మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications