Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
స్పైసీ మటన్ పలావ్... నోరూరించే రైతా

మటన్: 1/2kg
పలావు బియ్యం: 1/2kg
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 8-10
జీడిపప్పు: 1cup
నెయ్యి: 2tbsp
కొత్తిమీర: రెండు కట్టలు
లవంగాలు: 6-8
యాలకులు: 4
వెల్లుల్లి పేస్ట్: 2tsp
అల్లం: చిన్న ముక్క
దాల్చిన చెక్క: చిన్న ముక్క
గసగసాలు: 2tbsp
ధనియాలు: 2tbsp
పలావు ఆకులు: 2
మరాటీ మొగ్గ: 4-8
కొబ్బరికాయ: 1
నిమ్మకాయలు: 2
పుదీనా: ఒక కట్ట
ఉప్పు : సరిపడా
పెరుగు: 1/2ltr
తయారు చేయు విధానం:
1. పచ్చి మిర్చి, గసగసాలు, అల్లం, ధనియాలు వీటిని విడివిడిగా మెత్తగా నూరాలి, కొబ్బరి తురిమి పాలు తీసుకోవాలి, ఉల్లిపాయలను నిలువుగా తరిగిపెట్టుకోవాలి.
2. మటన్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెరుగు, రెండు నిమ్మకాయల రసం , తగినంత ఉప్పు, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వాటిలో సగాన్ని వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి పోసి బాగా కాగిన తరువాత అందులో అన్ని కలిపిన మటన్ ను వేసి నీరు అంతా ఇమిరేదాక ఇగర బెట్టాలి.
3 . ఇప్పడు మరొక పెద్ద గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.
4 . అందులోనే చెక్క, లవంగాలు, జీడిపప్పు, మరాటీ మొగ్గ, పలావు ఆకు, వేసి కాసేపు వేగనిచ్చి, మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కొంత సేపు వేగాక అందులో అరలీటరు కొబ్బరి పాలు, అర లీటరు నీళ్ళు కొలిచి పోసుకోవాలి.
5 . ఇందులోనే పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా మరగనిచ్చి ఎసరు మరిగేటప్పుడు కడిగిపెట్టుకొన్న బియ్యాన్ని కూడా వేయాలి.
6 . అన్నం వుడుకుతుండగా ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ ను కూడా అందులో వేసి బాగా కలబెట్టి మూత పెట్టాలి.
7 . తరువాత అది బాగా మగ్గాక పది నిమిషాలు వుంచి దింపేయాలి. దీనికి పెరుగు చట్నీ గాని, కుర్మా గాని మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications