Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
తందూరి చికెన్ సలాడ్ రుచి మరియు పుష్టికరం
లోఫ్యాట్ తందూరి చికెన్ సలాడ్ చాలా రుచికరమైనది . అంతే కాదు చాలా పుష్టికరమైనది కూడా. ఈ సలాడ్ తయారు చేయడం చాలా సులభం. కొన్ని మసాలాలు పట్టించడంతో వండర్ ఫుల్ బ్యాలెన్డ్స్ ఫేవర్స్ తో నోరూరిస్తుంటుంది.
ఇది ఒక బహుముఖ డిష్ ఎందుకంటే దీన్ని భోజనం లేదా డిన్నర్ కు ఏసమయంలోనైనా తినవచ్చు. అంతే కాదు ఈ సలాడ్ వేడిగానూ లేదా చల్లగానూ రెండు రకాలుగాను తినవచ్చు. ఇది శక్తిని కూడా అందిస్తుంది. ఈ చికెన్ సలాడ్ తక్కువ ఫ్యాట్ మరియు అధిక పోషకాంశాలు కలిగి ఉంటుంది. మరి ఈ లోఫ్యాట్ తందూరి చికెన్ సలాడ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావ లసిన పదార్థాలు :
స్కిన్ లెస్ చికెన్: 1/2kg
పైనాపిల్ : 1/2kg
మష్రూమ్స్ : 1cup
కీరదోసకాయ ముక్కలు: 1cup
జామకాయ : 1
టమాటాలు : 2
ఉల్లిపాయలు : 2
క్యాప్సికమ్ : 2
టమాటా సాస్: 2tbsp
క్రీమ్ : 1tbsp
పెరుగు : 1sp
ఛీజ్ : 1/2tsp
నల్ల ఉప్పు : 1tsp
ఉప్పు : 1/2tsp
ఆవ పిండి : 1/4tsp
చాట్ మసాలా : 1/2tsp
నల్ల మిరియాల పొడి : 1/4tsp
ఆమ్‌చూర్ పౌడర్ : 1/2tsp
సలాడ్ నూనె : 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా అన్ని కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగి (అవసరమైతే కొన్నిటిపై చెక్కుతీసి) మీకు ఇష్టమైన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మసాలా పదార్థాలు అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో శుభ్రం చేసుకొన్న చికెన్ ముక్కలు, వెజిటేబుల్,పండ్ల ముక్కలకు బాగా పట్టించి కొంతసేపు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత వాటిని సీకు(ఇనుప కడ్డీకి)కు గుచ్చి తందూరీ బట్టీ (మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించవచ్చు)లో ఉడికించాలి.
4. ఇలా ఉడికిన కూరగాయ, పండ్ల ముక్కలను సీకు నుంచి వేరు చేసి ప్లేటులోకి సర్దుకోవాలి. చివరన చాట్ మసాలా పొడి వాటిపైన చల్లి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications