హోం మేడ్ చికెన్ రోల్స్ : హెల్తీ అండ్ టేస్టీ

రోల్స్ స్నాక్ తయారు చేయడం చాలా సులభం మరియు టేస్టీ డిష్. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు. ఈ వెరైటీ చికెన్ స్టఫ్డ్ రోల్స్ ను చికెన్ తో పాటు కొన్ని మసాలా దినుసులతోటి తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ రోల్స్ తయారు చేయడం చాలా సులభం. వీటిని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.

చికెన్ రోల్ టేస్టీ స్నాక్ రిసిపి . చికెన్ రోల్ కి కొన్ని వెజిటేబుల్స్ చేర్చడం వల్ల ఇది టేస్టీ అండ్ హెల్తీ డిష్ . వెజిటేరియన్స్ అయితే ఓన్లీ వెజిటేబుల్స్ తోటే తయారుచేసుకోవచ్చు . ప్రిపేర్ చేసే పద్దతి కూడా చాలా సులభం. డైట్ కాన్సియస్ పర్సన్ అయితే, చికెన్ రోల్ ను డీఫ్ ఫ్రై చేయకుండా, ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. వీటిని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా ఇష్టపడుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెరైటీ చికెన్ స్టప్డ్ రోల్స్ ను తయారు చేయండి..

Yammy Homemade Chicken Rolls


కావల్సిన పదార్థాలు:
చపాతీలు: 4
ఉల్లిపాయలు: 1
క్యాప్సికమ్: 1
క్యారెట్ : 1
టమోటో: 1
నిమ్మకాయ: 1
మయోనైజ్: తగినంత

చికెన్ ఫిల్లింగ్ కోసం :
బోన్ లెస్ చికెన్: 150grm
ఉల్లిపాయ:1
పచ్చిమిర్చి: 3-4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
ధనియాలపొడి: 1tsp
చికెన్ మసాలా పొడి: 1tsp
జీలకర్రపొడి: 1/2tsp
షాజీరా : చిటికెడు
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
కరివేపాకు, కొత్తిమీర, పుదీనా : 2tbsp సన్నగా తరిగి పెట్టుకోవాలి
నూనె: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో షాజీరా, పుదీనా, ఉల్లిపాయ, కరివేపాకు, వేసి ఒక నిముషం వేగించుకోవాలి.
2. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించుకోవాలి.
3. ఇందులో ముందుగానే పసుపు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బోన్ లెస్ చికెన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూతపెట్టి 10 నిముషాలు మగ్గించాలి.
4. మగ్గిన చికెన్ లో ధనియాల పొడి, జీలకర్ర, చికెన్ మసాలా, కారం, ఉప్పు, వరుసగా వేస్తూ కలిపి మళ్ళీ మూతపెట్టి మరొక 10 నిముషాల వరకూ కర్రీని ఉడికించుకోవాలి.
5. కర్రీ దగ్గర పడుతున్నప్పుడు, మూత తీసి కలియబెడుతుండాలి. 5 నిముషాల తర్వాత వేయించితే చికెన్ స్టఫింగ్ రెడీ అయినట్లే..
6. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్ లను సన్నగా తరిగి, నిమ్మరసం పిండి సలాడ్ లాగా రెడీ చేసి పెట్టాలి.
7. ఇప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకొన్న చపాతీల మీద మయోనైజ్ అప్లై చేయాలి.
8. చపాతీ మొత్తం మయోజైజ్ అప్లై చేసిన తర్వాత చపాతీల మీద కూరగాయల ముక్కలు పెట్టాలి.
9. వీటి మీద ముందుగా తయారుచేసుకొన్న చికెన్ స్టఫ్ పెట్టాలి. అలాగే చికెన్ స్టఫ్ మీద తిరిగి వెజిటేబుల్ ముక్కలు వేసి స్టఫ్ చేయాలి.
10. చివరగా టమోటో సాస్ వేసి చపాతీని రోల్ చేస్తే సరి హోం మేడ్ చికెన్ రోల్ రెడీ...

Story first published: Tuesday, February 23, 2016, 13:14 [IST]
Desktop Bottom Promotion