Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నోరూరించే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ గ్రేవీ చపాతీ, రోటీ, బిర్యానీ మరియు రైస్ కు బెస్ట్ కాంబినేషన్
పనీర్ కర్రీ ఈ రోజు మనం రెస్టారెంట్ స్టైల్ గురించి తెలుసుకుందాం. ఈ వంటను చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్ స్టై రిసిపి రోటి రైస్ బిర్యానీతో పాటు తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. బిర్యానీతో వరైటీ కర్రీని కోరుకునే వారు దీన్ని ప్రయత్నించవచ్చు. ఈ రోజు పన్నీర్ కర్రీ మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇది అన్నం, చపాతీ, పుల్కాలు మరియు బిర్యానీ సైడ్ డిష్ లా తినొచ్చు. పనీర్ అనేది దక్షిణ భారతదేశపు వంటకాలలో విస్తృతంగా ఉపయోగించే తాజా చీజ్. దీనిని ఇండియన్ కాటేజ్ చీజ్ అని కూడా అంటారు.అధిక ప్రోటీన్ మరియు కాల్షియం కంటెంట్ కారణంగా, దీనిని సాధారణంగా శాఖాహార వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
దీనికి డిమాండ్ కూడా ఎక్కువే. రెస్టారెస్ట్ లో పనీర్ వంటలకు డిమాండ్ ఎక్కువ. చపాతీ రోటీలకు దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. పనీర్‌లో ప్రోటీన్లు, కాల్షియం మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్నందున అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మినరల్స్ కండరాల పెరుగుదల, ఎముకల ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి, పనీర్ మీ ఆహారంలో అద్భుతమైన అదనపు ఆహారంగా ఉంది . కాబట్టి. ఈ రోజు మనం కమ్మగా నోరూరించే పన్నీర్ కర్రీని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారుచేయాలో, అందుకు కవాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
పన్నీర్ 200 గ్రాములు
దాల్చిన చెక్క : చిన్న ముక్క
లవంగాలు 4-5
యాలకులు 3
జాపత్రి -1
స్టార్ ఆన్సీ ఫ్లవర్-1
బిర్యానీ ఆకు -1
అల్లం ముక్కులు 1tbs
వెల్లుల్లి పాయలు 2tbps
బాదం జీడిపప్పు 5-6
క్యారెట్ 1 (ముక్కలు)
ఉల్లిపాయ 1 (ముక్కలు)
ఒక పెద్ద టమోటో 1(ముక్కలు)
జీలక్రర 1/2tbsp
పసుపు 1/2tbsp
కారం 2tbsp
ఉప్పు :రుచికి సరిపడా, నీళ్లు తగినన్ని వేసుకోవాలి
తయారుచేయు విధానం :
- ధనియాలపొడి, అరటీస్పూన్ జీలకర్ర పొడిని, అరటీస్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు
- పన్నీర్ 200గ్రాములు పన్నీర్ తీసుకుని మీకు కావాల్సిన సైజ్ లోకట్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే పన్నీర్ ను ఇలా ఈజీగా తయారుచేసుకోవచ్చు.
- అన్ని పన్నీర్ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ గ్రేవీని తయారుచేయడానికి ముందుగా మసాల పేస్ట్ ను సిద్దం చేసుకోవాలి. దానికోసం..
- పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో దాల్చిని, లవంగాలు, యాలకులు, జాపత్రి, స్టార్ ఆన్సీ ఫ్లవర్, బిర్యానీ ఆకు, అల్లం ముక్కులు, వెల్లుల్లి పాయలు, 5-6బాదం జీడిపప్పు వేసి లైట్ గా వేగించుకోవాలి,
- ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు వేయాలి. (క్యారెట్ ఇష్టం లేని వారి స్కిప్ చేయవచ్చు).
- అలాగే ఇందులోనే మీడియం సైజ్ ఉల్లిపాయ ఒక పెద్ద టమోటో ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసి 5 నిముషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటో మగ్గిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- వేగించిన మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేయడానికి కొద్దిగా నీళ్లు జోడించి మెత్తగా గ్రైండ్ చేయండి.
- మసాలను గ్రైండ్ చేసుకున్నాక స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. గ్రేవీ బాగా టేస్టీగా ఉండాలంటే నూనె కొద్దిగా ఎక్కువే వేసుకోండి. నూనె బాగా వేడి అయ్యాక అందులో టేబుల్ స్పూన్ జీలక్రర వేసి ఒక నిముషం వేగించాలి.
- తర్వాత అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న మాసాలను వేసి బాగా వేగించాలి. ముందుగానే మసాలాన్ని వేగించి పేస్ట్ చేశాము కనుక రెండు , మూడు నిముషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది.
- ఇలావేగిన తర్వాత అందులో పసుపు, కారం ఒక్కొక్కో టీస్పూన్ వేయండి. కారం కావాలనుకునే వారు కాస్త ఎక్కువ కారం జోడించవచ్చు. వీటితో పాటు ఒక టీస్పూన్ ధనియాలపొడి, అరటీస్పూన్ జీలకర్ర పొడిని, అరటీస్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు కూడా జోడించి బాగా కలుపుతూ వేగించాలి.
- ఇలా మొత్తం మిశ్రమం కలిపి వేగించాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిబఠానీలు వేసి కలపండి. తర్వాత అందులోనే అరకప్పు పెరుగు బాగా కలుపుతూ వేగించండి. పెరుగును ఒకటి రెండు నిముషాల ఉడికించడం వల్ల పెరుగు ముద్దలు లేకుండా ఫ్రై చేయండి.
- రెండు నిముషాల తర్వాత కొద్దిగా నీళ్ళు జోడించండి. గ్రేవీ పల్చగా ఉండాలంటే నీరు మీరు అడ్జెట్ చేసుకోండి. మూత పెట్టి 5 నుండి 10 బాగా ఉడికించండి.
- తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత మూత పెట్టి , 5 నిముషాలు ఉడికించండి. పన్నీరు ఎక్కువ సేపు ఉడికించకూడదు.
- చివరిగా ఇందులోకి కొద్దిగా కస్తూరీ మేతీ లేదా కొత్తిమీర వేసి బాగా కలుపుకుని స్టౌ ఆఫ్ చేయండి. దీన్ని వేడి వేడిగా చపాతీ, పుల్కా, రోటి, బిర్యానీ, పులావ్ తో సర్వ్ చేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












