Latest Updates
-
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా?
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
ఉదయం నిద్రలేవగానే బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలన్నది గృహిణులకు పెద్ద టెన్షన్. తీరా చేద్దామంటే ఇంట్లో ఇడ్లీ లేదా దోశ పిండి లేకపోతే ఆ కంగారు మరింత పెరుగుతుంది. మీ ఇంట్లో అటుకులు ఉన్నాయా? అయితే ఏమాత్రం ఆలోచించకుండా క్షణాల్లో వేడివేడి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. అటుకులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్. అటుకుల ఇడ్లీకి స్పైసీ టమాటా చట్నీతో అద్దుకొని తింటుంటే ఆ మజానే వేరే. ఉదయం హడావిడిలో ఎంతో సులభంగా అటుకుల ఇడ్లీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

అటుకుల ఇడ్లీ తయారీకి కావాల్సినవి
అటుకులు - 1 కప్పు
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - 1 కప్పు
పుల్లటి పెరుగు - 1 కప్పు
నీళ్లు - తగినన్ని
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు, మినపపప్పు - 1 టీస్పూన్ చొప్పున
పల్లీలు (వేరుశెనగలు) - 2 టీస్పూన్లు
జీడిపప్పు - 5 లేదా 6
పసుపు లేదా మెంతుల పొడి - పావు టీస్పూన్
పచ్చిమిర్చి - 1
కరివేపాకు - 1 రెమ్మ
క్యారెట్ తురుము - 1 కప్పు
కొత్తిమీర తురుము - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్!
అటుకుల ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో అటుకులు తీసుకుని శుభ్రంగా రెండుసార్లు కడగాలి. అందులో పుల్లటి పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి బాగా కలిపి 15 నిమిషాల పాటు నాననివ్వాలి.
-నానిన అటుకులను మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకుని, ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, మినపపప్పు, పల్లీలు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు,మెంతుల పొడి వేసి వేయించాలి. తర్వాత ఇందులోనే క్యారెట్ తురుము, కొత్తిమీర జతచేసి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.
-ఇప్పుడు అందులో బొంబాయి రవ్వ వేసి, సన్నని మంటపై ఐదు నిమిషాల పాటు వేయించి స్టవ్ కట్టేయాలి. ఈ రవ్వ మిశ్రమాన్ని ముందుగా రుబ్బి పెట్టుకున్న అటుకుల పిండిలో వేసి బాగా కలపాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి, మూతపెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా..
-ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, రెడీ చేసుకున్న పిండిని వేసి ఆవిరిపై 10 నిమిషాల పాటు ఉడికిస్తే..నోట్లో వేస్తే కరిగిపోయే అటుకుల ఇడ్లీ రెడీ.
-వేడివేడి అటుకుల ఇడ్లీలను పుల్లపుల్లగా, కారంకారంగా, కొద్దిగా తీయగా ఉండే టమాటా చట్నీలో అద్దుకుని తింటుంటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
