Latest Updates
-
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.!
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్!
ఆంధ్రుల సాంప్రదాయ పిండివంటల్లో సున్నుండలు కు ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది. పండుగైనా, శుభకార్యమైనా, లేదా ఇంట్లో పిల్లలకు బలాన్నిచ్చే చిరుతిండి చేయాలన్నా వెంటనే గుర్తొచ్చేది సున్నుండలే. సాధారణంగా సున్నుండలను మినపప్పు, బెల్లం, నెయ్యితో తయారు చేస్తారు.

కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా, రుచితో పాటు పోషక విలువలను మరింత పెంచడానికి ఆధునిక గృహిణులు కనుగొన్న అద్భుతమైన రెసిపీ డ్రై ఫ్రూట్ సున్నుండలు. సాధారణ సున్నుండలకు బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ జోడించడం వల్ల ఇవి రుచిలో మరింత టేస్టీగా ఉండటంతో పాటు, ఆరోగ్య పరంగా సూపర్ ఫుడ్ గా మారిపోతాయి.
బజ్జీలు, పకోడీలు వద్దు.. వర్షాకాలంలో రాగి సూప్ ఇలా చేసి తాగితే బోలెడు బెనిఫిట్స్
డ్రై ఫ్రూట్ సున్నుండలు తయారీకి కావాల్సినవి
-బాదంపప్పు
-జీడిపప్పు
-బెల్లం
-మినపప్పు
-పెసరపప్పు
-బియ్యం
-నెయ్యి
-యాలకలు
డ్రై ఫ్రూట్ సున్నుండలు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 కప్పుల మినపప్పు వేసి లైట్ గా రంగు మారేంతవరకు వేయించుకొని ఓ ప్లేట్ లోకి తీసుకొని ఆరనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లోనే అర కప్పు పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసి రెండింటిని కలిపి దోరగా వేయించుకున్నాక వీటిని కూడా మినపప్పు ఉంచుకున్న ప్టైట్ లోనే వేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి అందులో అరకప్పు బాదంపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
-బాదంపప్పు లైట్ గా వేగిన తర్వాత అందులోనే అర కప్పు జీడిపప్పు వేసి రెండింటిని కలిపి వేయించుకోండి. వేగిన వాటిన నెయ్యిలో నుంచి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే స్టవ్ మీద పాన్ లో ముప్పావు కప్పు నెయ్యి వేసి కరిగించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించి చల్లార్చిన మిపపప్పు, పెసరపప్పు, 6 యాలకలు వేసి లైట్ బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా కాకుండా, బరకగా కాకుండా లైట్ బరకగా ఉండాలి.
-ఒక బేసన్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న పిండిని వేయండి.
-ఇప్పుడు వేయించుకున్న బాదం, జీడిపప్పులను కూడా మిక్సీలో వేసి లైట్ బరకగా వచ్చేట్లు గ్రైండ్ చేసుకోవాలి. దీనిని కూడా మిననప్పు పెసరపప్పు పిండిలోనే వేసి కలుపుకోవాలి.
-ఇప్పుడు రెండు కప్పుల బెల్లంని కూడా మిక్సీ జార్ లో వేసి లైట్ బరకగా గ్రైండ్ చేసుకొని దానిని కూడా బేసన్ లోని పిండి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
-ఇప్పుడు బేసన్ లోని మిశ్రమం మొత్తాన్ని ఎక్కడా ఉండలు లేకుండా చేత్తో బాగా కలిసేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు బేసన్ లోనే ఒక పక్కకి కొద్ది కొద్గిగా పిండిని జరుపుకుంటూ అందులో నెయ్యి కొద్ది కొద్దిగా పోసుకొని కలుపకుంటూ సున్నుండల్లా చుట్టుకోవాలి. వీటిని బాగా ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి.
కర్ణాటక ఫేమస్ మెంతి బాత్.. ఈ స్టైల్ లో చేస్తే టేస్ట్ వేరే లెవెల్..లంచ్ బాక్స్ కి సెట్!
ఆరోగ్య ప్రయోజనాలు
ఈ డ్రై ఫ్రూట్ సున్నుండలు కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, ఇదొక సంపూర్ణ పోషకాహారం. రోజుకు ఒక సున్నుండ తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. మినుములలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే నడుము నొప్పి , కీళ్ళ నొప్పులను తగ్గించడంలో మినపప్పు అద్భుతంగా పనిచేస్తుంది. డ్రై ఫ్రూట్స్ లోని ప్రోటీన్ కండరాల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications