Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హైదరాబాదీ స్పెషల్ హలీం..దీని రుచికి సాటి మరేదీ ఉండదు,ఇంట్లోనే ఇలా చేసుకోండి
రంజాన్ మాసం ప్రారంభమైపోయింది. ఇప్పుడు హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఎక్కడ చూసిన హలీం అమ్ముతుండటం మనం చూస్తున్నాం. వాస్తవానికి రంజాన్ మాసంలోనే హలీంని ఎక్కువగా తయారుచేస్తుంటారు. ఇది మధ్యప్రాచ్యం నుండి భారతదేశానికి వచ్చి, హైదరాబాద్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది రుచికరమైన, పోషకమైన ఆహారం. రంజాన్ మాసంలో రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత హలీం తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. శక్తిని అందిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది.
ఇది కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత రాకుండా కాపాడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. అయితే హలీంలో కూడా అనేక రకాలు ఉంటాయి. చికెన్ హలీం,మటన్ హలీలం,వెజ్ హలీం ఇలా వెరైటీలు ఉంటాయి. అయితే వీటన్నింటిలో మటన్ హలీం చాలా చాలా ఫేమస్. మటన్ తో చేసే హలీంని తినేందుకుకే ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. మటన్ హలీంని ఇంట్లో కూడా చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.మటన్ హలీం తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
మేక పిచ్చల కూర..శక్తికి, తృప్తికి ఫర్ఫెక్ట్ రెసిపి,ఎలా చేసుకోవాలంటే..
మటన్ హలీం తయారీకి కావలసిన పదార్థాలు
మటన్: 1 కేజీ
నెయ్యి: 1/2 కప్పు
మినపపప్పు: 1/4 కప్పు
శనగపప్పు: 1/4 కప్పు
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
గోధుమ రవ్వ: 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
బార్లీ: 1/2 కప్పు
పెసరపప్పు: 1/4 కప్పు
గరం మసాలా: 1 టీ స్పూన్
పసుపు: 1/2 టీ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: 1 కట్ట
పుదీనా: 1 కట్ట

మటన్ హలీం తయారీ విధానం
-ముందుగా గోధుమ రవ్వ, బార్లీ, పెసరపప్పు, శనగపప్పు, మినపపప్పులను శుభ్రంగా కడిగి కనీసం 2-3 గంటలపాటు నానబెట్టాలి.
-తర్వాత మటన్‌ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
-ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేడి చేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో మటన్ ముక్కలు, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపాకా తగినంత నీరు పోసి కుక్కర్ మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
-మటన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని చేత్తో లేదా మాషర్‌తో బాగా మెత్తగా చేయాలి.
-ఇప్పుడు నానబెట్టిన పప్పులు, గోధుమ రవ్వ, బార్లీలను కుక్కర్ లో వేసి తగినంత నీరు పోసి మెత్తగా ఉడికించాలి.
-ఉడికిన పప్పులు, గోధుమ రవ్వ, బార్లీ మిశ్రమాన్ని మటన్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
-తర్వాత అందులో కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి బాగా కలిపి 10-15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
-వేడి వేడి మటన్ హలీంను నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం, జీడిపప్పు, బాదం పప్పుతో అలంకరించి సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications