Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
కారంగా, కరకరలాడే పెప్పర్ చికెన్ 65..ఒక్కసారి తింటే వదలరు..ఎలా చేసుకోవాలంటే
పెప్పర్ చికెన్ 65 అనేది చాలా ప్రసిద్ధి చెందిన స్నాక్ లేదా స్టార్టర్. ఇది సాధారణంగా వేడి వేడి అన్నం, పుల్కాలు లేదా రొట్టెలతో పాటు సైడ్ డిష్ గా వడ్డిస్తారు. కొన్నిసార్లు దీనిని స్టార్టర్ గా కూడా ఆస్వాదిస్తారు. చికెన్ 65 అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఓ కథనం ప్రకారం చెన్నైలోని బుహారి హోటల్ 1965లో ఈ వంటకాన్ని మొదటిసారిగా తయారు చేసింది, అందుకే దీనికి "చికెన్ 65" అనే పేరు వచ్చిందని చెబుతారు. కొందరు మాత్రం దీని తయారీలో 65 రకాల మసాలా దినుసులు వాడతారని చెబుతారు.
ఏది ఏమైనా దీని రుచి, ఘాటైన తత్వం వల్ల ఈ వంటకం భారతదేశం అంతటా ప్రాచుర్యం పొందింది. పెప్పర్ చికెన్ 65 అనేది చికెన్ 65కి ఒక ప్రత్యేకమైన వెర్షన్, దీనిలో మిరియాల పొడి (black pepper) ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఇది మరింత ఘాటైన రుచిని ఇస్తుంది. పెప్పర్ చికెన్ ను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పెప్పర్ చికెన్ 65 తయారీకి కావలసిన పదార్థాలు
-బోన్ లెస్ చికెన్: 500 గ్రాములు
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
-కారం: 1-2 టేబుల్ స్పూన్లు
-పసుపు: 1/2 టీస్పూన్
-ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
-జీలకర్ర పొడి: 1 టీస్పూన్
-గరం మసాలా: 1 టీస్పూన్
-నల్ల మిరియాల పొడి: 1-2 టేబుల్ స్పూన్లు
-ఉప్పు: రుచికి సరిపడా
-పెరుగు: 2-3 టేబుల్ స్పూన్లు
-గుడ్డు (ఎగ్ వైట్ మాత్రమే): 1
-కార్న్‌ఫ్లోర్: 2 టేబుల్ స్పూన్లు
-మైదా: 1 టేబుల్ స్పూన్
-నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
-కరివేపాకు: 2 రెబ్బలు
-పచ్చిమిర్చి: 3-4
-నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
-కొత్తిమీర: కొద్దిగా
బెంగళూరు స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ..హైదరాబాద్ బిర్యానీలన్నీ దీని ముందు జుజుబీ..ఎలా చేయాలంటే
తయారీ విధానం
-ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, నీరు లేకుండా చూసుకోండి.
-తర్వాత ఒక పెద్ద గిన్నెలో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సగం నల్ల మిరియాల పొడి, ఉప్పు, పెరుగు, ఎగ్ వైట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కార్న్‌ఫ్లోర్, మైదా లేదా బియ్యప్పిండి వేసి చికెన్ కు అన్ని మసాలాలు బాగా పట్టేలా కలపాలి.
-కలిపిన చికెన్ ను కనీసం 30 నిమిషాల నుండి 1 గంట వరకు లేదా వీలైతే రాత్రంతా ఫ్రిజ్‌లో మ్యారినేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు బాగా పట్టి చికెన్ రుచిగా, మృదువుగా ఉంటుంది.
-తర్వాత ఒక కడాయిలో నూనెను వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకూడదు, లేదంటే నూనె చల్లబడి చికెన్ క్రిస్పీగా అవ్వదు. బ్యాచ్ లుగా వేయించుకోవాలి.
-మీడియం మంటపై చికెన్ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు అవి కరకరలాడేలా వేయించాలి. ఇది సుమారు 5-7 నిమిషాలు పట్టవచ్చు.
-వేయించిన చికెన్ ముక్కలను టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుని అదనపు నూనెను పీల్చుకోవడానికి పక్కన పెట్టుకోవాలి.
-అదే కడాయిలో కొద్దిగా నూనె ఉంచి, మిగిలిన నూనెను తీసివేయండి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాక మిగిలిన నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
-వేయించిన చికెన్ ముక్కలను ఈ తాళింపులో వేసి మసాలా అంతా చికెన్‌కు బాగా పట్టేలా 1-2 నిమిషాలు వేయించాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర దాని మీద చల్లుకోండి. అంతే పెప్పర్ చికెన్ 65 రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications