Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
ఆపిల్-కోకనట్ హల్వా: న్యూట్రీషియన్ స్వీట్ రిసిపి
రోజుకో ఆపిల్ తింటే.. మహాభాగ్యం లాంటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. యాపిల్ ఉపయోగాలు తెలుసుకుంటే ఇది నిజం అని మీరే అంగీకరిస్తారు. యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉన్న యాపిల్ మనకు పలురకాల క్యాన్సర్‌ల నుంచి రక్షణ ఇస్తుంది.యాపిల్ ఏజింగ్ ప్రాసెస్ నుంచి రక్షిస్తుంది. ఏజింగ్ కారణంగా సంభవించే బ్రెయిన్ డామేజ్‌ని నివారిస్తుంది. బ్రెయిన్‌ఫుడ్‌గా పనిచేసి..బ్రెయిన్‌ను సమర్ధవంతంగా పనిచేసేలా చేస్తుంది. హృద్రోగాలను నివారించడం, నిరోధించడం చేయగలదు. రోజూ ఒక యాపిల్ తీసుకుంటే లంగ్ క్యాన్సర్ రానే రాదు.
అలాగే పచ్చికొబ్బరి గురించి తెలియనివారుండరు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ వంటల్లో కొబ్బరి వాడకం ఎక్కువే. అందం, ఆరోగ్యం ఇలా అనేక రకాలుగా కొబ్బరి మనిషికి మేలు చేస్తుంది. అత్యధిక పోషకాలున్న డ్రై ఫ్రూట్స్ వల్ల అనేక లాభాలున్నాయి. డ్రై ఫ్రూట్స్ లో మోనోశాచ్యురేటెడ్ ఫ్యాటియా సిడ్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఈ రెండూ గుండెజబ్బుల బారి నుంచి కాపాడుతాయి. రోజూ కనీసం ఐదారు బాదం పప్పులు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి ఇన్ని ఉత్తమ విలువలున్న ఈ రెండు కాంబినేషన్లతో ఓ వంటకం చేస్తే, మీ శరీరానికి కావలసినన్నప్రోటీన్లు లభిస్తాయి.

కావల్సిన పదార్థాలు:
ఆపిల్: 1
కొబ్బరి తురుము: 1cup
డ్రై ఫ్రూట్స్: 20 grams
నెయ్యి: 2 tbsp
పంచదార: 1 cup
పాలు : 1 cup
యాలకలపొడి: కొద్దిగా
తయారుచేయు విధానం:
1. ఒక పాన్ తీసుకొని అందులో నీళ్ళు, పాలు, పంచదార, ఆపిల్ తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
2. ఇప్పుడు ఈ పాన్ ను స్టౌ మీద పెట్టి, మీడియం మంట మీద కొన్ని నిముషాలు ఉడికించాలి. మొత్తగా పేస్ట్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
3. మొత్తం మిశ్రమం చిక్కబడే సమయంలో అందులో డ్రైఫ్రూట్స్ (రఫ్ గా పొడి చేసుకొని లేదా అలాగే )వేసుకొని, బాగా మిక్స్ చేయాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపు కోవాలి.
4. ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకలపొడి వేసి మరో సారి మిక్స్ చేయాలి . అలాగే కొద్దిగా నెయ్యి మిక్స్ చేసి తర్వాత మరికొన్ని నిముషాలు ఉడకించుకోవాలి. చివరగా కొద్దిగా ఫుడ్ కలర్ అవసరం అనిపిస్తే జోడించుకోవచ్చు . అంతే ఆపిల్ హల్వా రెడీ. ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసి, చెర్రీస్ తో గార్నిష్ చేసి వేడి గా లేదా చల్లగా సర్వ్ చేయాలి. అంతే యాపిల్ హల్వా రెడీ...



Click it and Unblock the Notifications