Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కోకోనట్ పోలీలు(కొబ్బరి పోలీలు): ఉగాది స్పెషల్
పూర్ణం పోలీ లేదా పూర్ణం పూరి లేదా వబ్బట్టు లేదా బొబ్బట్లు ఇలా వివిధ రకాలుగా పిలుచుకొనే పోలీలను మన ఇండియన్ స్వీట్ డిష్ లలో చేర్చబడిందిజ. పూర్ణం పోలీలు ఒక ట్రెడిషనల్ స్వీట్ గా ఉగాది సమయంలో వీటిని ప్రత్యేకంగా తయారుచేసుకుంటారు. ఇంకా ఇది స్పెషల్ మహారాష్ట్రియన్ స్వీట్ డిష్ కూడా. ఈ స్వీట్ డిష్ ను ఉగాది సందర్భంగా తయారుచేసుకుంటారు.
ఉగాది నాడు ప్రత్యేక వంటకాలు చేసేందుకు అంతా ఉవ్విళ్లూ రుతుంటారు. అనేక రుచుల సంగమంగా ఉండే ఉగాది పచ్చడి తిన్నాక కాసింత తీపి తింటే ఉపశమనంగా ఉంటుందని భావించ డం కద్దు...మరి తీపిరుచులందించే కొబ్బరి బొబ్బట్ల గురించి తెలుసుకుందాం. అన్నిరోజులూ ఒక ఎత్తు, పండగ రోజు ఒక ఎత్తు. 'పండక్కు ఏం చేస్తున్నారు, ఏంచేశారు వంటి ప్రశ్నలు ఈ సందర్భంలో సర్వసాధారణం. అందునా ఇది ఉగాది. మరి ఎంచక్కని స్వీట్లతో ఉగాదిని ఉత్సాహభరితం, సంతోషభరితం చేసుకోవటం అభిలషణీయమే కదా. బొబ్బట్లు సంప్రదాయ పిండివంటే కానీ ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ శ్రమలేకుండా వైవిధ్యభరితంగా బొబ్బట్లను ఎలా తయారుచేసుకోవాలో 'బోల్డ్ స్కై. కామ్' మీకు వివరిస్తోంది....

మైదా: 2cups
చిరోటి రవ్వ: 3tbsp
పసుపు: చిటికెడు(అవసరంఅయితేనే)
బెల్లం తురుము: 1 ½ cup
కొబ్బరి తురుము : 2 cup(సన్నగా తురిమినిది)
యాలకులు: 2-3 (పౌడర్ చేసుకోవాలి)
నెయ్యి: 2tbsp
నీళ్ళు: మైదాపిండి కలుపుకోవడానికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైద, చిరోటి రవ్వ, రెండు టేబుల్ స్పూన్ల నూనె, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి, సరిపడా నీళ్ళు పోసి పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. కలుపు కొన్న తర్వాత అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు, అరకప్పు నీటిని డీప్ బాటమ్ పాన్ లో పోసి, బెల్లం తురుము వేసి మీడియం మంట మీద కరిగే వరకూ ఉడికించుకోవాలి. మద్యమ్యదలో కలియబెడుతూ, బెల్లం చిక్కగా పాకంలా తయారయ్యే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు అందులో ముందుగా తురిము పెట్టుకొన్నపచ్చికొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ, కొబ్బరిబెల్లంపాకం గడ్డిపడే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
4. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న మైదా పిండిని నుండి కొద్దిగా కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కొక్క ఉండను అరచేతిలో పెట్టుకొని మద్యలో కొద్దిగా లోతుగా వత్తి అందులో కొబ్బరి పాకం మిశ్రమాన్ని ఉండలా చేసి పెట్టి, అన్ని వైపులా కవర్ చేయాలి.
5. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి రాసి స్టఫ్ చేసిన మైదా బాల్ ను ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి నిధానంగా చపాతీలా చేత్తోనే వత్తుకోవాలి.
6. ఇలాకొన్నింటిని తయారుచేసి పెట్టుకోవాలి.
7. తర్వాత స్టౌ మీద వెడల్పాటి పాన్ పెట్టి, నెయ్యి రాసి వేడయ్యాక కొబ్బరి పూర్ణం పోలీలను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే కోకోనట్ పూర్ణం పోలి తినడానికి రెడీ. ఈ ఉగాది స్వీట్ డిష్ ను వేడి వేడిగా సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications











