Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మ్యాంగో ఐస్ క్రీమ్-సమ్మర్ టెంప్టేషన్
వేసవి కాలంలో ఎండ వేడి చిరాకు పెట్టించినా... మామిడి పండ్ల తియ్యదనం, కాయల పచ్చడి రుచులు గుర్తుకురాగానే ఆ వేడి చల్లగా పక్కకు జారుకుంటుంది. మామిడి పండును రొటీన్‌గా ముక్కలు కోసుకుని తినడమో, రసం తీసుకుని తాగడమో కాకుండా వెరైటీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది...
సాయంత్రమైతే సూర్యుడు బ్రేక్‌డౌన్ అవుతాడు. చల్లచల్లగా నోటికి చాక్లెట్ ఐస్‌క్రీమ్ చిక్కితే పుంజుకొని పక్క దేశాలకు పయనమవుతాడు. చంద్రుడు వెనిల్లా తిని వెన్నెల కాయడానికి తరలివస్తాడు. తోటలో పండిన మ్యాంగో వాంగో అని ఐస్‌క్రీమ్ పార్లర్‌లో నోరూరిస్తుంది. చాక్‌లెట్టూ, నట్టూ, పుల్ల తియ్యని ఆరెంజీ... క్రీమ్ క్రీమ్ కావడానికి ఓమ్‌క్రీమ్ అంటాయి. ఏ కాలానికైనా ఐస్‌క్రీమ్ బాగుంటుంది. ఎండాకాలంలో మాత్రం దానికి గోల్డెన్ కప్ అందుతుంది. బజారులో దొరికేది ఎందుకు? ఇంట్లో ట్రై చేయండి.హెల్దీగా ఎంజాయ్ చేయండి.

హోల్‌మిల్క్: 500ml
క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది): 230grms
పంచదార: 150grms
మ్యాంగో పల్ప్: 250grms
స్కిమ్డ్ మిల్క్ పౌడర్: 50grms
తయారు చేయు విధానం:
1. ముందుగా మిల్క్ బాయిలర్‌లో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలను (80 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో) మరగనివ్వాలి.
2. తర్వాత మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా వేస్తూ, బాగా కలపాలి.
3. తర్వాత పాల మిశ్రమంలో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి.
4. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లారనివ్వాలి. ఎంత త్వరగా చల్లారబెడితే ఐస్‌క్రీమ్ అంత మృదువుగా వస్తుంది.
5. పాల మిశ్రమం చల్లారక మ్యాంగో పల్ప్ వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి.
6. తర్వాత ఐస్‌క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్‌లో పది గంటలు పెట్టి, తర్వాత మామిడి పండు ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. అంతే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ.



Click it and Unblock the Notifications