Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
వరమహాలక్ష్మి స్పెషల్ - కేసరి బాత్
కావలసిన పదార్ధాలు:
సన్న రవ్వ: 2cups
పంచదార: 2cups
ఫుడ్ కలర్: చిటికెడు
పాలు: 2cups
జీడిపప్పు: 10-15
కిస్మిస్(ఎండు ద్రాక్ష): 10-15
యాలకుల పొడి: ఒక టీస్పూన్
నెయ్యి: 1/2cup
నీళ్ళు: 1cup

తయారు చేసే విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ తీసుకుని స్టౌ మీద పెట్టి తక్కువ మంట పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుని దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. 2. తరవాత రెండు స్పూన్స్ నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఒక త గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి బుడగలు వచ్చేదాకా బాగా మరగ నివ్వాలి. నీరు మరిగే సమయంలో రెండు కప్పుల పంచదారను వెయ్యాలి.
4. తరవాత పంచదార కరిగిపోయాక, పాలలో ఫుడ్ కలర్ ని కలిపి ఆ పాలను కూడా పంచదార ఉడికే నీళ్ళలో పోయాలి. పాలు పోసాక, పాలు పొంగిపోకుండా సన్నని మంట మీద పెట్టి పొంగు బాగా వచ్చాక వేయించి పెట్టుకొన్న రవ్వను గిన్నెలో పోస్తూ గరిటతో వుండ కట్ట కుండా కలపాలి.
5. తరవాత యాలకుల పొడి, వేయించి పెట్టుకొన్నజీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కలపాలి. నెయ్యి కూడా వేసి కొంచం దగ్గర పడేదాక సన్నని సెగ పైన కలుపుతూ వుండాలి. అంతే ఘుమ ఘుమ లాడే వేడి వేడి రవ్వ కేసరి బాత్ రెడీ.



Click it and Unblock the Notifications