Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
మస్క్ మెలోన్(దోస కాయ)జ్యూస్-సమ్మర్ స్పెషల్
పెరుగు వేడినిస్తే.. అదే మజ్జిగ చలవనిస్తుంది. మామిడి పండు వేడినిస్తే.. మామిడి మిల్‌కషేక్ చలవనిస్తుంది. ఇక బొప్పాయి సంగతి కొస్తే వేసవిలో వద్దే వద్దని పక్కన బెట్టేయడం ఎంతో మంచిది. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అనేది తెలుసుకోవడం ముఖ్యం.
వేసవిలో శరీరంలోని నీటిశాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. కాబట్టి నీటిని ఎక్కువ శాతం తీసుకో వాలి. గుర్తొచ్చినప్పుడల్లా నీటిని తాగడం చాలా మం చిది. దోసకాయ, పుచ్చకాయ, ద్రాక్ష జ్యూస్‌తో పాటు కొబ్బరి బోండాంలను తీసుకోవచ్చు. ఇంకా పండ్లను జ్యూస్ రూపంలో కాకుండా అలాగే తీసుకోవడం మంచిది. జ్యూస్‌గా తీసుకుంటే పండ్లలోని పీచు పదార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఐతే వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి ఎక్కువగా జ్యూసుల మీదికే మనస్సు మళ్ళుతుంది కాబట్టి, ఈ సమ్మర్ స్పెషల్ గా మస్క్ మెలోన్ జ్యూస్ తయారు చేసుకుందాం..

మస్క్ మెలోన్ (దోసకాయ)లో 96%నీరు ఉండటం చేత దీన్ని సమ్మర్ స్పెషల్ డ్రింక్ అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. చాలా సులభంగా తయారు చేసే ఈ మస్క్ మెలోన్ జ్యూస్ ను ఎలా తయారు చేయాలో చూడండి..
కావల్సిన పదార్థాలు:
మస్క్ మెలోన్(పుచ్చకాయ)
నిమ్మరసం: 2tsp
పంచదార: సరిపడా
తేనె: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా దోసకాయను రెండు బాగాలు కట్ చేసుకోవాలి. మద్యలోని విత్తనాలను తొలగించాలి.
2. తర్వాత ఔటర్ స్కిన్ కూడా తొలగించాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. ఈ ముక్కలను జ్యూసర్ లో వేసి దానికి తేనె, పంచదార వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసంర అయితే కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసుకోవచ్చు.
4. ఇప్పుడు ఈ జ్యూస్ ను గ్లాసులో పోసి దానికి నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి కొన్ని ఐస్ క్యూబ్ లను అందులో వేసి చల్ల చల్లగా సర్వ్ చేయాలి అంతే మస్క్ మెలోన్ జ్యూస్ రెడీ..



Click it and Unblock the Notifications