Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
స్పెషల్ ఈవెనింగ్ స్నాక్ పనీర్ పకోడ శాండ్‌విచ్

కావలసినపదార్థాల:
పనీర్: 250grms
బంగాళదుంప: 1 లేదా 2
బ్రెడ్ స్లైసులు: 2-3
పచ్చిమిర్చి: 6-8
కొత్తిమీరతరుగు: 2tbps
కారం: 1tsp
పసుపు: చిటికెడు
ఉల్లిపాయలు: 1
ఉప్పు: రుచికి తగినంత
శనగపిండి: 100grms
వాము: చిటికెడు
జీలకర్రపొడి: చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
నూనె: వేయించడానికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా పనీర్ ను సన్నని స్లైసులుగా కట్ చేసుకోవాలి.
2. తర్వాత బ్రెడ్ సైడ్స్ తీసేసి, త్రికోణాకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత శనగపిండిలో వాము, ఉప్పు, నీరు వేసి జారుగా కలపాలి.
4. అంతలోపు బంగాళదుంపను ఉడికించి, గరిటతో చిదమాలి. చిదిమిన బంగాళాదుంపను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, కారం, పసుపు, జీలకర్రపొడి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి కలపాలి.
5. తర్వాత పాన్ లో నూనె పోసి, వేడయ్యాక బ్రెడ్ స్లైస్‌కు పనీర్ స్లైసులను రెండువైపులా పెట్టి, అదమాలి.
6. తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా చేత్తో తీసుకొని, పనీర్ మీదుగా ఉంచి, శనగపిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని పుదీనా చట్నీతో లేదా టొమాటో సాస్ తో సర్వ్ చేయాలి. అంతే పన్నీర్ పకోడా సాడ్విచ్ రెడీ.



Click it and Unblock the Notifications