Latest Updates
-
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
పెసరపప్పు సమోసా మజాయే వేరు...

కావలసిన పదార్థాలు:
పిండి(పేస్ట్) కొరకు:
మైదా: 2cups
ఉప్పు: రుచికి తగినంత
జీలకర్ర: 1/2tsp
నెయ్యి: 5-6tsp
నూనె: వేయించడానికి సరిపడా
స్టఫింగ్ కోసం:
పెసరప్పు: 1/2cup(మొత్తగా ఉడికించి పెట్టుకొన్నది)
పొటాటో: 1/2cup(మొత్తగా ఉడికించి చిదిమిపెట్టకొన్నది)
పచ్చిమిర్చి: 3-4
అల్లం పేస్ట్: 1tsp
కారం: 1/2tsp
పసుపు: చిటికెడు
చాట్ మసాలా: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
చింతపులుసు: 1tsp
కొత్తిరితరుగు: కొద్దిగా
తయారు చేయు విధానము:
1. స్టఫింగ్ కోసం సిద్దంగా ఉంచుకొన్న పదార్థాలన్నింటికి ఒక బౌల్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి.
2. పేస్టే కొరకు రెడీ చేసుకొన్న పదార్థాలన్నింటి ఒక గిన్నెలో వేసి చపాతీ పిండిలా మొత్తగా, మృదువుగా కలిపి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు నానిన ఈ పిండిని కొద్ది, కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా తయారు చేసుకోవాలి. వాటి పూరీలాగా వత్తుకొని కరెక్ట్ గా సగానికి కట్ చేయాలి.
4. తర్వాత స్టఫింగ్ కి రెడీ చేసుకొన్న పొటాటో, పెసరపప్పు మిశ్రమాన్ని ఈ సంగపూరిలో పెట్టి ట్రైయాంగిల్ గా మూలలు కవర్ చేస్తూ వత్తుకోవాలి.
5. ఇలా పిండినంతటినీ సమోసాలుగా వత్తుకొన్న తర్వాత, పాన్ లో నూనె వేసి బాగా కాగిన తర్వాత రెడీ చేసుకొన్న సమోసాలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ దోరగా వేయించి తీయాలి. అంతే పెసరపప్పు సమోసా రెడీ. చట్నీతో కానీ సాస్ తోకాని సర్వ్ చేస్తే చాలా టేస్టీ గా లాగించేస్తారు.



Click it and Unblock the Notifications