Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
నోరూరించే రసమలై లాగించేయండి

పాలు - 1 ltr
పంచదార - 2 cup
పచ్చికోవా - 50 grms
కుంకుమపువ్వు - చిటికెడు
తయారు చేసే విధానం:
1. ముందుగా పాలను బాగా కాచి.. అందులో రెండు నిమ్మ చుక్కల రసం పిండి పాలను విరగ్గొట్టాలి.
2. తరువాత ఒక సన్నటి క్లాత్‌లో పాల మిశ్రమాన్ని పోసి మూతి బిగగట్టి వేలాడ దీయాలి. నీళ్లన్ని పోయి గట్టి ముద్ద మిగులుతుంది. దాంట్లో పచ్చికోవాను వేసి మెత్తగా కలిపి ఉండలుగా చేసి.. గారెల్లాగా వత్తుకోవాలి.
3. ఈలోగా పంచదారను లేతపాకం పట్టి ఉంచాలి. ఉడుకుతున్న పాకంలో పైన తయారు చేసిన ఉండలను వేసి సన్నటి మంటమీద ఉడికించాలి.
4. ఇవి ఉడికేలోగానే వేరే గిన్నెలో పాలుపోసి దాంట్లో సగం కప్పు పంచదార, చిటికెడు కుంకుమపువ్వు, పచ్చికోవా వేసి చిక్కబడేంతదాకా మరిగించాలి.
5. ఆపై పాకంలో ఉడికించిన ఉండలను కోవా మిశ్రమంలో కలిపి చల్లారబెట్టి, ఫ్రిజ్‌లో ఉంచి.. చల్లబడిన తరువాత తీసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన రసమలై రెడీ.



Click it and Unblock the Notifications