Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
స్వీట్ - హాట్ పాపడ్ రోల్స్

కావలసిన పదార్థాలు
అప్పడాలు: 8
బంగాళాదుంపలు: 4
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిపాయ: 1
ఉప్పు: రుచికితగినంత
కారం: తగినంత
గరం మసాలా: 1/2tsp
పంచదార: చిటికెడు
శెనగపిండి: 1tsp
నూనె తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను శుభ్రంగా కడిగి మూడు విజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించాలి. చల్లారక పొట్టతీసి చేత్తో మెదపాలి.
2. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు గిన్నెలోకి బంగాళాదుంప ముద్ద, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం చేర్చి బాగా కలపాలి.
4. శెనగపిండిలో కాసిని నీళ్లు పోసి మిశ్రమం కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పడాల మీద కాసిన్ని నీళ్లు చల్లుకొంటే మెత్తబడతాయి. వాటిలో బంగాళాదుంప మిశ్రమం పెట్టి రోల్ లా చుట్టు శెనగపిండితో మూసేయాలి.
5. ఇప్పుడు పాన్ లో నూనె పోసి వేడిఅయ్యాక చుట్టి ఉంచుకొన్న అప్పడాలను వేయించి పెట్టుకోవాలి. దించాక వాటిని ముక్కలుగా కోసుకొంటే బాగుంటాయి. వీటికి పుదీనా చట్నీ లేదా టమోటో సాస్ తో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications