తందూరి పనీర్ టిక్కా రిసిపి బెస్ట్ ఈవెనింగ్ స్నాక్

తందూరి పనీర్ టిక్కా రుచికరమైన వెజిటేరియన్ స్టార్టర్. వెజిటేబుల్స్ మరియు కొన్ని మసాలాలతో బేక్ చేసిన పనీర్ క్యూబ్ రుచి మాత్రమే కాదు, హెల్తీ కూడా. వీటిని తయారుచేయడానికి ఒక సరైన పద్దతి మరియు సరైన పదర్థాలు ఎంపిక చేసుకొన్నట్లైతే పనీర్ టిక్కా చాలా ఆరోగ్యకరం. పనీర్, వెజిటేబుల్స్ ను బేక్ చేయడం వల్ల వీటిలోని పోషకాలు నష్టపోవు.

మీరు డైట్ ఫాలో అవుతుంటే , లోఫ్యాట్ పనీర్ ను ఉపయోగించండి. ఇంకా మీరు పనీర్ కు బదులు టోఫును ఉపయోగించవచ్చు . ముఖ్యంగా కొన్ని మసాలాలను పెరుగుతో మ్యారినేట్ చేయడం వల్ల అంతటి అద్భుత టేస్ట్ వస్తుంది. మరి మీరు టేస్ట్ చేయాలంటే..తయారు చేసే పద్దతిని ఫాలో అవ్వాల్సిందే...

Tandoori Paneer Tikka Recipe

కావల్సిన పదార్థాలు:
పనీర్: 250gms(చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
గ్రీన్ క్యాప్సికమ్: 1(క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి)
రెడ్ బెల్ పెప్పర్: ½(క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి)
టమోటా: 1(క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి), గుజ్జు వాడవద్దు
మ్యారినేషన్ కొరకు
పెరుగు: 1cup(మందపాటి)
అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్: 2tsp
పసుపు: 1tsp
ధనియాల పొడి: 1tsp
కారం: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
నల్ల మిరియాలు పొడి: ½ స్పూన్
తందూరి మసాలా: 1tsp
ఆమ్ చూర్: ఒక చిటికెడు
మెంతి ఆకులు(ఎండినవి): ½tsp(అవసరంఐతేనే)
నిమ్మరసం: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
వెన్న: 1tbsp(గార్నిషింగ్ కోసం)

తయారుచేయు విధానం:
1. ఒక మిక్సింగ్ బౌల్లో మ్యారినేషన్ కోసం సిద్ధం చేసుకొన్న పదార్థాలన్ని వేసిబాగా మిక్స్ చేయాలి. ముఖ్యంగా పెరుగును ఒక పల్చన వస్త్రంలో వడగట్టుకోవాలి. ఏ మాత్రం నీరు లేకుండా గడ్డగా పెరుగును తీసుకొని మ్యారినేట్ వస్తువులతో కలిపి మిక్స్ చేసుకోవాలి.
2. ఇప్పుడు ఈ మ్యారినేట్ మిశ్రమాన్ని రెండు బాగాలుగా చేయాలి. ఒక బౌల్ తీసుకొని అందులో క్యాప్సికమ్, రెడ్ బెల్ పెప్పర్స్ మరియు టమోటో క్యూబ్స్ వేసి ఒక్క బాగం మ్యారినేట్ మిశ్రమం వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. మరో బౌల్లో పన్నీర్ క్యూబ్స్ వేసి, మిగిన సగబాగం మ్యారినేట్ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు మ్యారినేటెడ్ పదార్థాలు కనీసం 3 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు, స్కీవర్స్ ను ఐస్ కోల్డ్ వాటర్ లో ఒక గంట పాటు నానబెట్టాలి . ఇలాచేయడం వల్ల స్కీవర్క్ మాడిపోకుండా లేదా కాలిపోకుండా నివారించవచ్చు.
5. ఇప్పుడు వోవెన్ ను 375F హీటో లో ఉంచి, బేకింగ్ డిష్ ను అల్యూమినియం ఫోయిల్ తో కవర్ చేయాలి. దానిమీద నూనె లేదా బటర్ ను అప్లై చేయాలి.
6. స్కీవర్స్ కు మ్యారినేట్ చేసుపెట్టుకొన్న వెజిటేబుల్స్ మరియు పన్నీర్ క్యూబ్స్ ను ఒక దానికి తర్వాత ఒకటి గుచ్చి పెట్టాలి.
7. స్కీవర్స్ ఫుల్ గా గుచ్చిన తర్వాత వీటిని బేకింగ్ డిష్ లో పెట్టి 20నిముషాలు పెట్టాలి.
8. టిక్కా మూర్తిగా బర్న్ కాకుండా వాటి మీద బటర్ ను అప్లై చేయాలి. ఇలా పూర్తిగా బేక్ చేసుకొన్న తర్వాత వాటిని ఓవెన్ నుండి బయటకు తీయాలి. అంతే తందూరి పన్నీర్ టిక్క రెడీ. ఈ వెజిటేరియన్ స్టార్టర్స్ ను చట్నీతో సర్వ్ చేయండి.

Story first published: Monday, September 30, 2013, 17:31 [IST]
Desktop Bottom Promotion