వెర్మీసెల్లీ లడ్డు

Vermicelli Laddu
కావలసిన పదార్ధాలు:
వెర్మిసెల్లీ(సేమియా) : 250grms
పంచదార : 250 grms
నెయ్యి : 100 grms
యాలకుల పొడి : 1 tsp

తయారు చేయు విధానము:

1. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగిన తర్వాత వెర్మిసెల్లీని వేసి ఎరుపు రంగు వచ్చే వరకూ వేయించి తీయాలి.
2. వెర్మీసెల్లీ చల్లారిన తర్వాత మిక్సీలో చక్కెర మరియు వేయించిన వెర్మిసెల్లీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. గ్రైడ్ చేసుకొన్న మిశ్రమాన్ని ఒక పళ్ళెంటో వేసి అందులో యాలకుల పొడి కలుపుకోవాలి.
4. కరిగించిన వేడి వేడి నెయ్యిని వెర్మిసెల్లీ పొడి మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. వేడి మీదనే లడ్డూలా వత్తుకోవాలి అంతే సేమియా లడ్డు రెడీ.

Story first published: Wednesday, December 2, 2009, 16:25 [IST]
Desktop Bottom Promotion