Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
సొరకాయ వేపుడు లేదా సొరకాయ పల్యం కేవలం సైడ్ డిష్ కాదు..ఆరోగ్యపు గని
మన భోజనంలో అన్నం పప్పు, సాంబార్ తో పాటు తప్పనిసరిగా సైడ్ డిష్ అనేది ఉంటుంది. సైడ్ డిష్ కోసం, ఆలూ వేపుడు, బీన్స్ వేపుడు, క్యారెట్ అండ్ బీట్ రూట్ వేపుడు ఇలా వివిధ రకాల వేపుడులు తయారుచేసుకుంటారు. ఇవన్నీ సాధారణంగా చేసే వేపుళ్లు. అయితే సొరకాయ వేపుడు మీరు ప్రయత్నించారా? సొరకాయను చాలా మంది ఇష్టపడు. బహుషా అది ఎలాంటి ప్రత్యేకమైన రుచిని అందివ్వదు కాబట్టి. కానీ అందులోని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరు దీన్ని వదలిపెట్టరు. ఒక రకంగా దీన్ని పోషకాల గని అని చెప్పవచ్చు. సొరకాయలో 96% నీరు ఉంటుంది. కాబట్ట,మీ రోజువారీ ఆహారంలో వెంటనే చేర్చుకోండి!
జీర్ణక్రియను మరియు రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె జబ్బులను తగ్గించడంలో సొరకాయ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గిస్తుంది ఇందులో నీటి కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి సూపర్ కూలింగ్ మరియు వేసవికి తగిన కూరగాయల ఎంపిక. అలసటను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది తేలికపాటిది తక్కువ క్యాలరీల కారణంగా మధుమేహగ్రస్తులుకు చాలా మంచిది. అనవసరమైన కోరికలను అరికట్టడం ద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయడపుతుంది.మరి ఇన్ని ప్రయోజనాలున్న సొరకాయను మన డైలీ ఫుడ్ లో చేర్చుకోకపోతే ఎలా. మీకోసం ఈ రోజు ఒక అద్భుతమైన సొరకాయ వంటను పరిచయం చేస్తున్నాం. అదే సొరకాయ వేపుడు.

Image courtesy vegrecipesofkarnataka
సొరకాయ వేపుడు సాధారణంగా కాకుండా కొంచెం వెరైటీగా పెసరపప్పు ఉపయోగించి
తయారుచేసుకోవడం వల్ల రుచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది అన్నం మరియు
చపాతీలకు అద్భుతమైన రుచిని అందిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ
పల్యం ఎలా తయారుచేయాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ
తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
సొరకాయ : మీడియం సైస్ 1
పెసరపప్పు: 1/4 కప్పు
ఉద్దిపప్పు: 1స్పూన్
వంట నూనె 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ :1
ఎండు మిర్చి :3
పచ్చిమిర్చి: 4
ఆవాలు : ఒక టేబుల్ స్పూన్
పసుపు చిటికెడు
ఇంగువ చిటికెడు
కరివేపాకు రెండు రెమ్మలు
కొబ్బరి తురుము 1/4 కప్పు
ఉప్పు రుచికి సరిపడా
కొత్తిమీర గార్నిషింగ్ కోసం కొద్దిగా

తయారుచేయు విధానం:
ముందుగా పెసరపప్పును ఒక బౌల్లో తీసుకుని నీళ్ళు పోసి బాగా శుభ్రంగా
కడిగి సరిపడా నీళ్ళు పోసి 15 నిముషాలు నానబెట్టుకోవాలి.
అంతలోపు బాగా లేతగా ఉండే సొరకాయను తీసుకుని దానికి పైన పొట్టు తీసేసుకోవాలి. తర్వాత నీటితో శుభ్రంగా కడిగాలి.
ఇప్పుడు సొరకాయను ముక్కలు గా కట్ చేసుకోవాలి. సొరకాయ చాల లేతగా ఉంటే కాయ మొత్తం ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కాయలోపల విత్తనాలు ఉంటే లోపల గుజ్జును తొలగించిన తర్వాత సొరకాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
సొరకాయ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర ఉద్దిపప్పు, శెనగపప్పు రెండు ఎండుమిర్చి , 4 పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
రెండు నిముషాలు వేగిన తర్వాత కరివేపాకు వేసి వేగిన తర్వాత అందులో సొరకాయ ముక్కలు కూడా వేసి వేగించాలి.
సొరకాయ ముక్కలు 5 నిముషాలు వేగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, చిటికెడు ఇంగువ , పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుతూ వేగించుకోవాలి.
సొరకాయ పెసరప్పు మిశ్రమం వేగిన తర్వాత అరకప్పు నీళు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మద్య మద్యలో కలుపుతూ వేగించుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు జోడించుకోవచ్చు.
మొత్తం మిశ్రమం 10 నుండి 15 నిముషాల్లోపు ఉడికిపోతుంది. చివరగా కొబ్బరి తురుము మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే సరి. అంతే రుచికరమైన సొరకాయ పళ్యం లేదా సొకాయ వేపుడు రెడీ. ఇది మీకు అన్నం మరియు చపాతీలకు అంద్భుతమైన రుచిని అందిస్తుంది. దీనికి ఉల్లిపాయ వెల్లుల్లి అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications