Latest Updates
-
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి!
ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే లెమన్ టీ
నిమ్మ పొట్టను మాత్రమే కాదు, శరీరంలో మొత్తంను శుభ్రం చేస్తుంది. ఒక క్లీనింగ్ ఏజెంట్ గా శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అందువల్ల, లెమన్ టీ, సాధారణ టీని బీట్ చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచతుంది మరియు ఆరోగ్యంగా ఉంచతుంది. ఇంకా లెమన్ టీ బరువు తగ్గిస్తుంది.
ఈ హెర్బల్ టీ శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది. మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే తగినంత మోతాదులో తీసుకోవాలి. లెమన్ టీ వల్ల అనేక ఆరోగ్యసమస్యలను నివారించుకోవచ్చు. ఉదా: జలుబు, దగ్గు, హ్యాంగోవర్ మరియు బరవుతగ్గడం. నిమ్మరసంలోని సిట్రస్ యాసిడ్ నేరుగా శరీరంలోకి చేరి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే ఈ లెమన్ టీ ఎలా తయారుచేయాలో చూడండి...

కావల్సిన పదార్థాలు:
బ్లాక్ టీ ఆకలు: 1tbsp(ఇంకా మీరు రెండు ప్లెయిన్ టీ బ్యాగ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు)
నిమ్మకాయ: 1
దాల్చిన చెక్క: చిన్నముక్క
తేనె: 1/2tbsp
లెమన్ స్లైస్: 5-6(గార్నిషింగ్)
తయారుచేయు విధానం:
1. టీ పాత్రలో కొద్దిగా నీళ్ళు తీసుకొని బాగా మరిగించాలి.
2. అందులో బ్లాక్ టీ ఆకలు వేయాలి. లేదా టీబ్యాగ్స్ ను కూడా డిప్ చేయవచ్చు.
3. ఇప్పుడు అందులో నిమ్మరసం, తేనె మరియు దాల్చిన చెక్క వేసి, రెండు, మూడు నిముషాలు ఉడికించుకోవాలి.
4. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఒక కప్పులోనికి వడగట్టుకొని సర్వింగ్ కప్పులో పోసి, లెమన్ స్లైస్ తో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. లేదా త్రాగాలి. అంతే లెమన్ టీ త్రాగడానికి రెడీ. ఈ వెయిట్ లాస్ టీని వేడిగా లేదా చల్లగా త్రాగవచ్చు. శరీరంలో క్రొవ్వు కరిగించడానికి ఈ టీ బాగా సహాయపడుతుంది మరియు గొంతు ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications