Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
శ్రీరాముడికి నైవేధ్యంగా పెట్టే స్వీట్ ఇదే..ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవచ్చో చూడండి
శ్రీరామనవమి పండుగ సందర్భంగా తయారుచేసే ప్రత్యేకమైన ప్రసాదాల్లో వడపప్పు పానకం తర్వాత స్థానంలో రవ్వ పాయసం ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ రవ్వ పాయసాన్ని ప్రత్యేకంగా తయారుచేసి రాముడికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత కుటుంబ సభ్యులు, అతిథులకు ప్రసాదంగా పంచుతారు. సులభంగా తయారుచేయగలిగే ఈ పాయసం పండుగ వాతావరణానికి మరింత శోభను తీసుకొస్తుంది.
ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శ్రీరామనవమి స్పెషల్ రవ్వ పాయసం ఇంట్లో తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

రవ్వ పాయసం తయారుచేయడానికి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ (సూజీ) - 1 కప్పు
నెయ్యి - 2-3 టేబుల్ స్పూన్లు
పంచదార - 1 కప్పు
పాలు - 4 కప్పులు
నీరు - 1 కప్పు
యాలకుల పొడి - 1/2 టీ స్పూన్
కిస్మిస్ - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్
బాదం పప్పు - 1 టేబుల్ స్పూన్
పిస్తా పప్పు - 1/2 టేబుల్ స్పూన్
కుంకుమ పువ్వు - చిటికెడు
రాముడి కాలం నాటి బ్రేక్ ఫాస్ట్..తింటే 100 ఏళ్లు గ్యారెంటీ,ఎలా చేయాలంటే..
రవ్వ పాయసం తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి అడుగు కలిగిన గిన్నె లేదా కడాయి స్టవ్ మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి.
-నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోండి. రవ్వ మంచి సువాసన వచ్చే వరకు, కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి.
-రవ్వ వేగిన తర్వాత దానిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే కడాయిలో నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు వేసి దోరగా వేయించుకోండి. ఇవి బంగారు రంగులోకి మారిన తర్వాత కిస్మిస్ వేసి అవి ఉబ్బే వరకు వేయించుకోండి.
-వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే గిన్నెలో పాలు పోసి వేడి చేయండి. పాలు పొంగు రావడం ప్రారంభించిన తర్వాత మంటను తగ్గించి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలి.
-రవ్వ పాలలో బాగా కలిసి కొద్దిగా ఉడికిన తర్వాత పంచదార వేయండి. పంచదార కరిగే వరకు పాయసం చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించండి. అవసరమైతే కొద్దిగా నీరు కూడా కలుపుకోవచ్చు. కానీ ఎక్కువ నీరు వేయడం వల్ల పాయసం రుచి తగ్గే అవకాశం ఉంది.
-పాయసం కావలసినంత చిక్కబడిన తర్వాత, యాలకుల పొడి వేసి బాగా కలపండి.
-చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు కలిపిన పాలు వేసి ఒకసారి బాగా కలపండి.
-స్టవ్ ఆఫ్ చేసి పాయసాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. వేడి వేడిగా లేదా చల్లగా అయినా సర్వ్ చేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications