Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
చుక్క ఆయిల్ అక్కర్లేదు..పొద్దున్నే ఈ జొన్న అంబలి తింటే కొండలు ఢీ కొట్టే శక్తి ..ఎలా చేసుకోవాలంటే
సమ్మర్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అంటే చద్దన్నమే. ఎండాకాలంలో పొద్దున్నే చద్దన్నం తింటే కడుపులో హాయిగా ఉంటుంది..మన శరీరానికి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఈ చద్దన్నంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే బియ్యంతో చేసిన చద్దన్నం తింటే బరువు పెరుగుతారని అంటుంటారు కాబట్టి జొన్నలతో చేసిన చద్దన్నం తినడం బెస్ట్. డయాబెటిస్ పేషెంట్లు కూడా ఈ జొన్నల చద్దన్నం హాయిగా తినొచ్చు. చుక్క ఆయిల్ అవసరం లేకుండానే జొన్న చద్దన్నం లేదా జొన్న అంబలిని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
జొన్న అంబలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-జొన్నలు
-మజ్జిగ
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-నీరు

జొన్న అంబలి తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు జొన్నలు శుభ్రంగా కడిగి 8-10 గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత జొన్నలలోని నీళ్లు మొత్తం ఒంపేసుకొని నానిన జొన్నలను మిక్సీలో వేసి నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసి ఈ ఆ పొడిని ఓ గిన్నెలో వేసి అందులో ఓ గ్లాసు నీళ్లు పోసి పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద అడుగు మందం కలిగిన గిన్నె పెట్టి అందులో 4 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి మరిగించుకోవాలి.
నాన్ వెజ్ కి పోటీగా వెజ్ లివర్ ఫ్రై..పప్పుచారు,సాంబార్‌తో నంచుకుంటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే
-నీళ్లు మరిగాక అందులో నీళ్లు కలిపిన జొన్న పిండిని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. చిక్కబడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
-చిక్కబడిన తర్వాత మంటను తక్కువగా పెట్టి మూతపెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 15 నిమిషాలు పడుతుంది.
-ఉడికిన తర్వాత దీన్ని దించేసి కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. ఇదే అరలీటరు పాలు కాచి వాటిలో తోడు వేసి ఉంచండి.
-తెల్లారిన తర్వాత తోడు వేసిన పెరుగులో కొంచెం నీళ్లు పోసి బాగా చిలికి ఆ మొత్తాన్ని జొన్నల అన్నంలో పోసి బాగా కలపాలి. అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటే జొన్న చద్దన్నం లేదా జొన్న అంబలి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications